Ammayi garu Serial Today May 26th: అమ్మాయి గారు సీరియల్: విజయాంబిక, దీపక్‌లను పోలీసుల అవతారంలో చావగొట్టిన రాజు, రూపలు!
Ammayi garu Today Episode దీపక్, విజయాంబికలకు బుద్ధి చెప్పాలని రాజు, రూపలు పోలీసుల్లా గెటప్ వేసుకొని ఇద్దరినీ చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రుక్మిణి విరూపాక్షి, రాఘవల కూతురని విజయాంబిక సూర్యప్రతాప్‌కి నమ్మించి లెటర్ పంపడంతో సూర్యప్రతాప్ రుక్మిణికి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తారు. విజయాంబిక, దీపక్‌లు డీఎన్‌ఏ రిపోర్ట్స్ తమకు అనుకూలంగా వచ్చేలా చేయాలని హాస్పిటల్‌కి వెళ్లి డబ్బుతో మ్యానేజ్ చేయాలని అనుకుంటారు. రాజు, రూపలు తల్లీకొడుకులకు బుద్ధి చెప్పాలని బయల్దేరుతారు.
విజయాంబిక, దీపక్‌లు వెళ్తున్న కారుకు మందారం ఓ ముసలామెలా గెటప్ వేసుకొని కర్ర పట్టుకొని వచ్చి కారు ముందు పడిపోతుంది. అందరూ వచ్చి ముసలిదాన్ని గుద్దేశారు. ఎంత పని అయిపోయింది పెద్ద యాక్సిడెంట్ అని అంటారు. పోలీసులకు ఫోన్ చేయమని అక్కడ గుమిగూడిన వాళ్లు అనడంతో దీపక్ కారు వెనక్కి తిప్పేస్తాడు. అందరూ కారుని అడ్డుకొని కిందకి దిగమని అంటారు. ఇంతలో రాజు, రూపలు పోలీసుల్లా డ్రస్ వేసుకొని పెద్ద పెద్ద మీసాలు, గడ్డాలు పెట్టుకొని వస్తారు. ముసలావిడలా ఉన్న మందారం వాళ్లకి సైగ చేస్తుంది.
రాజు దీపక్‌ని పట్టుకొని బయటకు లాగి పేరు అడిగి దీపక్ని కొట్టి తాగి డ్రైవ్ చేస్తున్నావా కొడతాడు. రూప కూడా విజయాంబికను కొట్టి ప్లాన్ చేసి చంపేశారా. మీరు చేసిన పనికి ఓ నిండు ప్రాణం పోయింది అంటాడు. ముందు స్టేషన్‌కి పదండి అంటారు. నేను సీఎం సూర్యప్రతాప్ మేనల్లుడిని ఆవిడ సీఎం గారి అక్క మమల్ని టచ్ చేస్తే ఏం అవుతుందో చూడండి అంటారు. దానికి రాజు దీపక్‌ని కొట్టి పెద్ద వాళ్ల పేరు వాడుకుంటున్నారా అని అంటాడు. భర్త అత్తల్ని రూప, రాజులు కొట్టడం చూసి మందారం నవ్వుకుంటుంది. విజయాంబిక కొడుకుని కారులో డబ్బు తీసుకురమ్మని చెప్పి ఎంత కావాలి అంటే అంత ఇస్తాం అని వచ్చి రాజు చేతిలో డబ్బు పెడతారు. ఇది సరిపోతుందా అనడంతో ఒంటి మీద బంగారం మొత్తం ఊర్చి ఇస్తారు.
డబ్బు చనిపోయిన ముసలావిడ కుటుంబానికి డబ్బు ఇస్తాం కానీ ఇప్పుడు మీ మీద కేసు పెట్టాల్సిందే అని అంటారు. డీఎన్‌ఏ రిపోర్ట్స్ మార్చే పని ఉందని ఎలా అయినా వెళ్లాలి అని విజయాంబిక అనుకుంటుంది. పోలీసులుగా ఉన్న రాజు, రూపలతో అర్జెంట్ పని ఉందని అంటారు. వెళ్లడం కుదరదు అనడంతో బతిమాలుతారు. దానికి రాజు రెండు లాటిలు ఇచ్చి ఇద్దరూ ఒకర్ని ఒకరు కొట్టుకొని ఎవరు దెబ్బలకు తట్టుకొని ఇంటికి వెళ్తే వాళ్లు వెళ్లొచ్చు అంటారు. దీపక్, విజయాంబికలు ఎవరో ఒకరు వెళ్లి పని చూసుకోవచ్చని కొట్టుకుంటారు. ఒకర్ని ఒకరు చితక్కొట్టుకుంటారు. ఇద్దరూ కుయ్యోమోర్రో మని ఇంటికి వెళ్తారు.
రాజు, రూప మందారం గెటప్ తీసి హ్యాపీగా ఫీలవుతారు. ఇక విజయాంబిక డీఎన్‌ఏ రిపోర్ట్స్ జోలికి వెళ్లరు అని రిలాక్స్ అవుతారు. విజయాంబిక ఇచ్చిన డబ్బు మందారం అక్కడ యాక్ట్ చేసిన వాళ్లకి పంచుతుంది. సూర్యప్రతాప్ లెటర్ గురించి తలచు కొని బాధ పడతాడు. విరూపాక్షి సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి తాను చెప్పింది నిజం అని తనని అర్థం చేసుకోమని చెప్తుంది. నీ స్థానంలో నేను ఎప్పటికీ నేను ఉండను అని సూర్యప్రతాప్ కోప్పడతాడు. నన్ను నమ్మకపోయినా నా పేరు మీద వచ్చిన ఆ కొరియర్ నమ్మొద్దు అని విరూపాక్షి సూర్యప్రతాప్‌ని బతిమాలుతుంది. మన బిడ్డ మీద ఒట్టు అని విరూపాక్షి అంటే మన బిడ్డ మీద ఒట్టు వేస్తే చంపేస్తా అని సూర్యప్రతాప్ అంటారు. విరూపాక్షిని గెంటేయబోతే బంటి వచ్చి ఏంటి తాతయ్య ఎందుకు అంత పెద్దగా అరిచారు.. ఎందుకు అమ్మమ్మ మీద చేయి వేశారు. ఆడవాళ్ల మీద చేయి వేయడం తప్పు కదా మీరు ఎందుకు అమ్మమ్మ మీద చేయి వేశారు అని అడుగుతాడు. దానికి విరూపాక్షి ఎందుకంటే మీ తాతయ్యకు నేను భార్యని భార్య మీద చేయి వేసే హక్కు భర్తకి మాత్రమే ఉంది అంటుంది.
ఇంతలో విజయాంబిక దీపక్‌లు కుయ్యోముర్రో అని ఇంటికి వస్తారు. ఏమైందని అడిగితే నా తమ్ముడికి మంచి జరగాలి అని పూజ చేయాలి అని వెళ్తే యాక్సిడెంట్ అయిందని అంటారు. బంటి వాళ్లని దగ్గర నుంచి చూసి యాక్సిడెంట్లా లేదు ఎవరో కర్రలతో కొట్టినట్లు ఉందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!





















