Ammayi garu Serial Today july 9th: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షిని భారీ స్కామ్‌లో ఇరికించేందుకు తల్లీకొడుకుల కుట్ర!
Ammayi garu Today Episode విరూపాక్షిని ఇరికించాలని విజయాంబిక పేదల ఇళ్ల స్థలాలను అడ్డుపెట్టుకోవాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు, రూపలు విజయాంబిక, దీపక్‌ల దగ్గరకు వెళ్లి మీ ప్లాన్ మొత్తం మా అమ్మ వినేసిందని మీరు ఇద్దరూ చేసిన తప్పులకు శిక్ష అనుభవించడం ఖాయం అని రూప అంటుంది. విరూపాక్షి వల్లే ఇదంతా జరుగుతుంది. దాని అడ్డు తొలగించుకోవాలని విజయాంబిక అంటుంది. అంతకంటే ముందు ఓ ప్లేస్‌కి వెళ్లాలి అని తమ్ముడి దగ్గరకు వెళ్తుంది.
సూర్యప్రతాప్ నా మీద నీకు కోపం ఉందని నాకు తెలుసు తమ్ముడు.. నేనేం చేసిన నీ కోసం మన ఇంటి కోసమే చేశాను అని అంటుంది. దాంతో సూర్యప్రతాప్ కేకలు వేసి నాశత్రువులతో చేతులు కలిపి నాకు నా ఇంటి మంచి చేయడం ఏంటి అని అరుస్తారు. విజయాంబికను అక్కడి నుంచి వెళ్లిపోమని అంటాడు. దాంతో విజయాంబిక వెళ్లిపోతా తమ్ముడు కానీ నువ్వు మారిపోతున్నావ్.. విరూపాక్షి పేరు నచ్చని నువ్వు తనతో కలిసి వ్రతం చేశావ్.. విరూపాక్షిని క్షమించను అంటూనే పక్కనే కూర్చొంటావ్.. విరూపాక్షి అంటే కోపం అంటూనే తనని అంగీకరిస్తున్నావేమో అని అంటుంది. దాంతో సూర్యప్రతాప్ నేను తనని అంగీకరించడం ఈ జన్మలో జరగదు అంటాడు. నీ చేతులతో నువ్వే గెంటేసిన మనిషి కూతుర్ని అడ్డు పెట్టుకొని నిన్నే ఓ ఆట ఆడిస్తుందని అంటుంది.
సూర్యప్రతాప్ కోపంగా ఎవరు ఎన్ని చేసినా నన్ను మార్చలేరు విరూపాక్షి ఒక్క తప్పు చేసినా ఈ ఇంట్లోనుంచి గెంటేస్తా అంటాడు. ఈ మాత్రం చాలు ఆట నేను ఆడిస్తా అని విజయాంబిక అనుకుంటుంది. పేద ప్రజల ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి విరూపాక్షి ప్రాజెక్ట్ ఓకే అవుతుంది. విరూపాక్షి రాజు, రూపలతో విషయం చెప్పి సంతోషపడుతుంది. విజయాంబిక అది విని నీ కలని నేను చెడగొడతా అనుకుంటుంది. రూప విరూపాక్షిని తన తండ్రి ఎంత ద్వేషిస్తున్నాడో గుర్తు చేసుకొని బాధ పడుతుంది. రాజు వచ్చి ఏమైందని అడిగితే ఏం లేదని రూప అంటుంది. రూపని నవ్వించడానికి రాజు రూపని చూస్తూ దగ్గరకు తీసుకొని కితకితలు పెడతాడు. రూప నవ్వేస్తుంది.
విరూపాక్షి ఉదయం పేదలతో మాట్లాడుతుంది. వాళ్లకి కేటాయించి ఇళ్ల స్థలం చూపిస్తుంది. ఒక్కో ఇంటికి రానున్న ఇంటి స్థలం విలువ 50 లక్షలు ఉంటుందని అందుకు డీడీగా 50 వేలు కట్టమని మిగతా విషయాలు వినోద్ చెప్తాడని చెప్పి వెళ్లిపోతుంది. రాజు, రూపలు ఉదయం కారులో వెళ్తుంటారు. రూప డల్‌గా ఉండటం చూసి రాజు ఏమైందని అడుగుతాడు. రూప రాజుతో అమ్మనాన్నల గురించి ఆలోచిస్తున్నా అమ్మకి దక్కాల్సిన విలువ దక్కడం లేదని బాధ పడుతుంది. ఇప్పటి వరకు నాన్న అన్నీ నాకోసమే చేశారని నాన్నకి నేను బతిమాలితేనే వ్రతానికి వచ్చారని గుర్తు చేస్తుంది. అమ్మ మీద నాన్నకి ఉన్న కోపం నువ్వు నేను తీర్చలేమని అంటుంది. రాఘవ దొరికితే సమస్యలు పోతాయని అనుకున్నా కానీ ఇప్పుడు ఆ నమ్మకం లేదు అత్తయ్య అమ్మని గెంటించేవరకు ఊరుకోదని అంటుంది. మరోవైపు దీపక్, విజయాంబికలు విరూపాక్షి పీఏ వినోద్‌ని ఆపి మీ మేడంని ఇరికించాలి అనుకుంటున్నాం అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!





















