Ammayi garu Serial Today july 3rd: అమ్మాయి గారు సీరియల్: నేనే నీ కన్నతల్లినిరా బంటీ.. నిజం చెప్పేసిన రూప.. మొత్తం వినేసిన సూర్య!
Ammayi garu Today Episode రూప తాను రుక్మిణి కాదు రూప అని బంటీతో చెప్పడం సూర్యప్రతాప్ వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రుక్మిణిలా ఉన్న రూప, రాజులకు సూర్యప్రతాప్, విరూపాక్షి దగ్గరుండి పెళ్లి చేస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. విజయాంబిక మనసులో మీరు ఎలా సంతోషంగా ఉంటారో అది చూస్తా అనుకుంటుంది. దీపక్ తల్లితో మనం వాళ్లకి నిద్ర లేకుండా చేద్దాం అనుకుంటే వాళ్లే మనకు నిద్ర లేకుండా చేశారని అంటాడు. ఇక రాజు, రుక్మిణిలు అందరి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్తారు.
విరూపాక్షి కూతురు అల్లుడికి హారతి తీస్తుంది. బంటీ ఇద్దరిని ఆపి రుక్మిణి అమ్మ నాకు అమ్మ కావాలి అనుకున్నా అలాగే జరిగింది ఇప్పుడు ఇద్దరూ ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రండి అని అంటాడు. ఏం జరిగినా చూస్తూ ఉండటం తప్ప ఇంకేం చేయలేం మమ్మీ అని దీపక్, విజయాంబికలు మూతి తిప్పుకుంటారు. బంటీ పేర్లు చెప్పుకొని లోపలికి రావాలని అంటాడు. దాంతో రుక్మిణి నేను ఆయన వచ్చాం అంటుంది. ఆయన పేరు ఆయనా అని అడుగుతాడు. అందరూ నవ్వుతారు. ఇక రుక్మిణి నేను నా భర్త రాజుతో వచ్చా అంటుంది. రాజు అందరి ముందు నేను రాజు నా భార్య రూపతో వచ్చా అంటాడు. విజయాంబిక వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడని అంటుంది.
విరూపాక్షి వెంటనే రుక్మిణిని బంటీ రూపలా ఫీలవుతున్నాడని నువ్వు కూడా రూపగా ఫీలవుతున్నావ్ అని అంటుంది. రాజు అవును అని ఇకపై బంటీకి పెద్దయ్యగారికి అందరికీ రూప గారిలానే రుక్మిణి ఉండాలని అలా చెప్పానని అంటాడు. దీపక్ తల్లితో మొత్తం వాళ్లకి అనుకూలంగా మార్చుకుంటున్నారని అంటాడు. సూర్యప్రతాప్ కూతురు, అల్లుడిని తీసుకెళ్లి రుక్మిణితో నువ్వు నా మాట పోకూడదు అని ఒప్పుకున్నావో ఏంటో తెలీదు కానీ రాజు నీకు అన్ని విధాలా మంచి వాడు అని అంటుంది. ఇద్దరూ ఎలా ఉండాలో అన్ని ప్రేమగా చెప్తారు. నమ్మకం, ప్రేమ అన్నీ ఉండాలి ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని చెప్తారు. ఇద్దరి కాపురం బాగుండాలి అంటే నమ్మకం ఉండాలని విరూపాక్షిని ఉద్దేశించి మనల్ని నమ్మిన వారిని మోసం చేయాలి అనే ఆలోచన ఏ మూలన పుట్టుకూడదు అని అంటారు.
రూప మనసులో మిమల్ని చాలా బాధ పెడుతున్నా నన్ను క్షమించు నాన్న కొన్ని రోజులు తప్పదు నాన్న అనుకుంటుంది. సుమ, చంద్రలు సూర్యప్రతాప్‌తో మీరు ఏం చేయాలి అనుకున్నారో అది చేద్దాం చెప్పండి అంటుంది. సూర్యప్రతాప్ సత్యన్నారాయణ వ్రతం చేయిద్దామని అంటారు. దీపక్, విజయాంబికలు ఏది ఏమైనా రుక్మిణినే రూప అని నిరూపించి తీరుతానని అనుకుంటుంది. గదిలో బంటీ తల్లిని పట్టుకొని అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ అని అంటాడు. నాకు థ్యాంక్స్ ఎందుకు అని అంటుంది. రాజు మనసులో అమ్మాయిగారు ఏంటి రుక్మిణి అని మర్చిపోయారా ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటాడు. రుక్మిణి అని పిలుస్తాడు.
బంటీని చూసి రూప మనసు తట్టుకోలేక నీకు ఓ పెద్ద రహస్యం చెప్తా ఎవరికీ చెప్పకు అని బంటీ నేను రుక్మిణిని కాదు మీ అమ్మ రూపని అని చెప్తుంది. రాజు ఆపిన రూప రాజుని ఉండమని అంటూ నేను చనిపోలేదు బతికే ఉన్నాను అంటుంది. నేను అమ్మకి తలకొరివి పెట్టాను అమ్మ చనిపోవడం చూశాను అని బంటీ అంటే లేదు బంటీ అదంతా అబద్దం ఇక నువ్వు అది తలచుకోవద్దు. అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా నీ బాగోగులు చూస్తూ ఉండాల్సిన నేను నిన్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయాను. కన్న తల్లి అయి కూడా నేను నీ తల్లిని అని చెప్పుకునే దీనస్థితి ఏ తల్లికి రాకూడదు. ఎదురుగా అమ్మని పెట్టుకొని నీలో మీ అమ్మని చూసుకుంటున్నా అని నువ్వు అంటుంటే లోపలి ప్రేగు కదిలిపోతుందిరా. నన్ను నమ్మారా నేను మీ అమ్మని రూపని అని ఏడుస్తుంది. బంటీ ఏం మాట్లాడకుండా తండ్రి వైపు చూస్తాడు. రూప రాజుతో నువ్వు చెప్తేనే బంటీ నమ్ముతాడు చెప్పు రాజు అంటుంది. రాజు ఏం మాట్లాడకుండా ఉంటాడు. రూప చెప్పడంతో రాజు బంటీతో మీ అమ్మ చెప్పింది అంతా నిజమే అని చెప్తాడు. అప్పుడే సూర్యప్రతాప్‌ని తీసుకొని విజయాంబిక, దీపక్‌లు వస్తారు. మొత్తం వినేస్తారు. రూప షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'





















