Ammayi garu Serial Today july 16th: అమ్మాయి గారు సీరియల్: దీపక్‌ని పచ్చడి చేసిన తల్లి.. ఐలమ్మ ఎంట్రీ.. ప్రమాదంలో విరూపాక్షి!
Ammayi garu Today Episode విరూపాక్షి రూపని కాపాడిన ఐలమ్మతో మాట్లాడటం దీపక్ చూసి వీడియో తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప, రాజులు విజయాంబిక దగ్గరకు వచ్చి పీఏ ఎక్కడున్నాడో మాకు ఎలా తెలిసిందో తెలుసా అత్తా అని రాత్రి దీపక్ మందారంతో మందు కలిపి తాగించడం గురించి చెప్తుంది. మందారం దీపక్‌ని రెచ్చగొట్టి ఫుల్లుగా తాగించి అడ్రస్ తెలుసుకోవడం గురించి చెప్తుంది. దాంతో విజయాంబిక కొడుకుని కొడుతుంది.
విరూపాక్షి ఓ చోట దిగులుగా ఉంటే రాజు, రూపలు వెళ్తారు. రాజు ఏమైంది అమ్మగారు అని అడిగితే నువ్వు లేకపోతే ఈ రోజు నా పరిస్థితి ఏమైపోయేది రాజు.. అప్పట్లో మీనాన్న నన్ను జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు నువ్వు చూసుకుంటున్నావు.. నువ్వు నా కడుపులో పుట్టకపోయినా నా కడుపున పుట్టిన బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటున్నావ్ రాజు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీడం లేదు రాజు అని ఏడుస్తుంది. రాజు విరూపాక్షితో ఏంటి అమ్మగారు నేను మీ అల్లుడిని మాత్రమే కాదు మీకు అవసరం అయితే మీ సేవకుడిని మీకు ఆపద వస్తే మీ రక్షకుడిని పీఏ గురించి నాకు తెలిసేది కాదు అమ్మాయిగారు మందారం వల్లే తెలిసింది అని విజయాంబిక, దీపక్‌ల కుట్ర మొత్తం చెప్తారు. నేనేం పాపం చేశాం వాళ్లు నా మీద ఎందుకు పగ పట్టారు అని విరూపాక్షి అంటుంది. దాంతో రాజు రాఘవ దొరికే వరకే వాళ్ల ఆటలు సాగుతాయి. ఒకసారి రాఘవ దొరికితే అదే వాళ్లకి చివరి రోజు అవుతుందని అంటాడు.
విజయాంబిక కొడుకుని గదిలోకి తీసుకెళ్లి పచ్చడి పచ్చడి కొడుతుంది. కొడుకుని కొట్టి కొట్టి విజయాంబిక కూడా అలసిపోతుంది. దీపక్ ఏడుస్తూ మమ్మీ మరి కొట్టొద్దే మూడు గంటల నుంచి వాయిస్తున్నావ్ నీ కొడుకుని నీ చేతులతో చంపేస్తావా అంటే విజయాంబిక మళ్లీ కోపంతో మూడు గంటలు కాదు 30 గంటలు అయినా కొట్టాలి బంగారం లాంటి అవకాశం చెడగొట్టావ్ కదరా అంటూ మళ్లీ వాయించేస్తుంది. గది మొత్తం తిప్పి తిప్పి కొడుతుంది. దీపక్ ఓ చోట రెక్కలు తెగిన పక్షిలా పడుంటాడు. విజయాంబిక కూడా కొట్టి కొట్టి అలసిపోతుంది. మందారం చూసి నోరెళ్లపెట్టి కొత్తగా కనిపిస్తున్నారు దీపక్ బాబు అంటుంది. మా అమ్మ నుంచి నన్ను కాపాడు మందారం అని దీపక్ అంటే దానికి మందారం ఏంటి దీపక్ బాబు రాత్రంతా మాకు పిండం పెడతామని చెప్పి ఇప్పుడు కాపాడమని నాకు దండం పెడుతున్నారని అంటుంది. ఇక పీఏ ప్లాన్ గురించి మళ్లీ మందారం చెబితే విజయాంబిక మళ్లీ కొడుకుని కొడుతుంది. ఈ దెబ్బలు తగ్గడానికి మందులు సెట్ అవ్వవు అని మందు మంచింగ్‌కి ఆమ్లెట్ తెస్తానని అంటుంది. దాంతో విజయాంబిక కోపంతో ఆమ్లెట్ నేను చేస్తా నువ్వు వేడి నీళ్లు తీసుకురా అంటుంది.
సూర్యప్రతాప్ పొలిటికల్ పనులు చూస్తుంటే బంటీ వచ్చి బయటకు తీసుకెళ్లమని అంటాడు. చంద్ర బంటీతో తాతయ్య సీఎం అలా బయటకు ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అంటాడు. దాంతో సూర్యప్రతాప్ ఆపి తర్వాత తీసుకెళ్తా అని అంటాడు. బంటీ కోపంతో నాకు స్కూల్ ఇళ్లు తప్ప నాకు ఇంకేం తెలీదు. అందరూ ఆట పట్టిస్తున్నారని బావిలో కప్ప అని ఏడిపిస్తున్నారని కేకలేస్తాడు. దాంతో రుక్మిణి, రాజులు వచ్చి తాము బయటకు తీసుకెళ్తామని చెప్తారు. ఇక విరూపాక్షికి రూపని కాపాడిన ఐలమ్మ ఫోన్ చేస్తుంది. సాయం కావాలి అని ఇంటికి వచ్చానని అంటుంది. ఇంటి దగ్గరే ఉన్నానని అనడంతో విరూపాక్షి చాలా కంగారు పడుతుంది. ఐలమ్మ ఇంటికి వస్తే సూర్యప్రతాప్‌కి నిజం తెలిసిపోతుందని విరూపాక్షి కంగారు పడుతుంది.
ఐలమ్మకి ఫోన్‌లో ఏదో చెప్పి విరూపాక్షి కంగారుగా బయటకు వెళ్తుంది. తల్లీకొడుకులు అది గమనిస్తారు. రాజు కూడా చూసి ఎక్కడికి వెళ్తాన్నారు అనుకుంటాడు. దీపక్ విరూపాక్షిని ఫాలో అవుతాడు. ఐలమ్మ మనవరాలి ఆపరేషన్ కోసం రెండు లక్షలు అడుగుతుంది. విరూపాక్షి డబ్బు ఇచ్చి అన్నీ ఖర్చులు తానే భరిస్తా అంటుంది. దీపక్ మొత్తం వీడియో తీస్తాడు. దీపక్ తల్లికి ఫోన్ చేసి రుక్మిణి రూప ఒక్కరే అని నిరూపించే అవకాశం దొరికిందని రూపని కాపాడిన ఆవిడ అత్తని కలిసిందని చెప్తాడు. ఆవిడను ఎలా అయినా తీసుకొచ్చి మామయ్య ముందు నిల్చొపెడతా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అర్ధరాత్రి లోహితని చెట్టుకి కట్టేసిన మధు.. వెక్కి వెక్కి ఏడుస్తున్న లోహిత.. వీడియో వైరలైతే?





















