Ammayi garu Serial Today july 15th: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షి అరెస్ట్.. రాజు ఎంట్రీతో ట్విస్ట్! పీఏ ఏం చెప్పబోతున్నాడు?
Ammayi garu Today Episode పీఏ అడ్రస్ తెలిసిందని రూప తల్లితో చెప్పడం విజయాంబిక వినేసి పీఏని పారిపోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రుక్మిణి తన తల్లిని సమస్య నుంచి గట్టెక్కించమని కోరుకుంటుంది. విజయాంబిక వచ్చి అంత సీన్ లేదని మీ అమ్మని బయటకు గెంటేయడానికి రెడీగా ఉండమని అంటుంది. విరూపాక్షి రూప దగ్గరకు వచ్చి నాకు శిక్ష పడుతుందని భయం లేదు కానీ మీ నాన్న పేరు పోతుందని మీ నాన్న మనసులో నామీద పడిన ముద్ర గురించే నాకు బాధ అని అంటుంది.
రూప తల్లికి ధైర్యం చెప్తుంది. రాజు పీఏని వెతికి తీసుకొస్తాడని చెప్తుంది. రాజుకి పీఏ ఎక్కడున్నాడో తెలుసు అని రూప తల్లితో చెప్తుంది. పీఏ ఉన్న చోటుకే రాజు వెళ్లాడు కచ్చితంగా తీసుకొస్తాడని చెప్తుంది. ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకుంటారు. విరూపాక్షి, రూపల మాటలు విజయాంబిక వినేస్తుంది. దీపక్ దగ్గరకు పరుగులు పెట్టి రాజుకి పీఏ ఎక్కడున్నాడో తెలిసిపోయిందని చెప్తుంది. దీపక్ షాక్ అయిపోతాడు. రాజు ఇప్పటికే వెళ్లిపోయాడని వెంటనే వాడికి ఫోన్ చేసి పారిపోమని చెప్పమని విజయాంబిక దీపక్‌తో చెప్తుంది. దీపక్ పీఏకి కాల్ చేస్తాడు.
రాజుకి నువ్వు ఉన్న అడ్రస్ తెలిసిపోయింది వెంటనే పారిపో అని చెప్తాడు. పీఏ వినోద్ సరే అని అంటాడు. పీఏ పారిపోతుంటే ఎదురుగా రాజు వెళ్తాడు. పీఏ షాక్ అయిపోతాడు. రాజుని రౌడీలు అడ్డుకుంటారు. ఇంతలో పీఏ పారిపోతాడు. తర్వాత దీపక్‌కి కాల్ చేసి తప్పించుకున్నానని చెప్తాడు. రూప, విరూపాక్షిలు రాజు కోసం ఎదురు చూస్తుంటాడు. పీఏని ఎలా అయినా రాజు తీసుకురావాలని మొక్కుంటారు. విజయాంబిక, దీపక్‌లు నవ్వుకుంటారు. ఇంటికి పోలీసులు వస్తారు.
సూర్యప్రతాప్ రుక్మిణిని పిలిచి మీరు అడిగిన టైం అయిపోయిందని చెప్తారు. పోలీసుల్ని విరూపాక్షిని అరెస్ట్ చేయమని చెప్తారు. రుక్మిణి తండ్రిని ఆపి రాజు వచ్చే వరకు అయినా ఎదురు చూడమని చెప్తాడు. మందారం రాజుకి కాల్ చేస్తుంది. ఇక పోలీసులు విరూపాక్షితో లొంగిపోమని చెప్తారు. రుక్మిణి తల్లిని అరెస్ట్ చేయించొద్దని రాజు వచ్చేస్తాడని బతిమాలుతుంది. విజయాంబిక మాత్రం అరెస్ట్ చేయించమని అంటుంది. పోలీసులు విరూపాక్షిని పిలుస్తారు. విరూపాక్షి సూర్యని చూసి కన్నీరు పెట్టుకొని పోలీసులతో వెళ్లిపోతుంది. రుక్మిణి అమ్మా అని విరూపాక్షి వెనక పరుగులు తీస్తుంది.
సొంత పార్టీ ఎమ్మెల్యేని సూర్యప్రతాప్ అరెస్ట్ చేయిస్తున్నారని సూర్యప్రతాప్ నిజాయితీ నిరూపించుకున్నారని న్యూస్ చెప్తారు. పోలీసులు విరూపాక్షిని జీపు ఎక్కించే టైంకి పీఏని రాజు తీసుకొని వస్తారు. ప్లాష్ బ్యాక్‌లో రాజు పీఏని చితక్కొట్టి నిజం చెప్పమని ఈడ్చుకొని వస్తాడు. పీఏని చూసి తల్లీకొడుకులు భయపడతారు. పీఏని రాజు విరూపాక్షి కాళ్లకింద పడేసి నిజం చెప్పమని అంటారు. బయట గందరగోళం విని సూర్యప్రతాప్ బయటకు వచ్చి చూస్తాడు. పీఏకి అందరూ నిజం చెప్పమని అడుగుతారు. పీఏ నిజం చెప్పబోయే టైంకి విజయాంబిక వచ్చి చితక్కొడుతుంది. తన పేరు చెప్పకుండా నోరు నొక్కేస్తుంది. దాంతో పీఏ డబ్బుకి కక్కూర్తి పడి తానే ఇదంతా చేశానని చెప్తాడు. విరూపాక్షి పీఏని కొట్టి నీకు నిజంగా డబ్బు కావాలి అంటే నేనే ఇచ్చేవాడిని కదా అని అంటుంది. అందరూ వచ్చి దేవత లాంటి అమ్మా గారిని ఇబ్బంది పెట్టాడని చితక్కొడతారు.
సూర్యప్రతాప్ ఆపి పోలీసులకు పట్టిస్తారు. అందరూ విరూపాక్షికి క్షమాపణలు చెప్తారు. రూప, రాజులు తల్లీకొడుకులు దగ్గరకు వెళ్లి అమ్మని ఇరికించడానికి బాగా ప్లాన్ చేశారు. ఈ విషయం మాకు ఎలా తెలిసిందో తెలుసా అని దీపక్ మందు తాగుతూ మందారంతో మందు కలిపించుకునే టైంలో నిజం చెప్పిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: షాకింగ్.. విహారి కిడ్నాప్.. నడి రోడ్డు మీద కారు.. అర్థరాత్రి ఏం జరిగింది?





















