Ammayi garu Serial Today December 9th: రుక్మిణి చంపడానికి కాల్చిన బుల్లెట్ రూప ఛాతిలో నుంచి దూసుకుపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది..?
Ammayi garu Serial December 9th: కోమలి బండారం బయటపెట్టేందుకు ఆశ్రమం నుంచి పెద్దమనుషులు రాగా...అశోక్ అమ్మాయిగారిని చంపేందుకు గన్ పేల్చుతాడు. ఆమె తప్పుకోవడంతో బుల్లెట్ కోమలికి తగులుతుంది.

Ammayi garu Serial Today Episode: బర్త్‌డే పార్టీకి రుక్మిణిరాగా...రూప ఎక్కడని సూర్య అడగడంతో కోమలి మేడపై నుంచి కిందకు వస్తుంది. అటు అశోక్...రూపను చంపడానికి గన్ తీసుకుని బయలుదేరతాడు. మరోవైపు ఆశ్రమం నుంచి అందరూ సూర్య ఇంటికి వస్తుంటారు. ఇంతలో రుక్మిణి కోమలి వద్దకు వచ్చి హ్యాపీ బర్త్‌డే అక్క అంటూ విష్ చేస్తుంది. ఈపరిణామంతో కోమలితోపాటు విజయాంబిక కూడా ఆశ్చర్యపోతుంది. రూపని, రుక్మిణిని చూసి అందరూ ఎంతో సంతోషపడతారు. రుక్మిణి కోమలి దగ్గరకు వెళ్లి ఈరోజుతో నీపని అయిపోయిందని... నీ బండారం బయటపడబోతుందని చెప్పడంతో ఆమె గుండె గతుక్కుమంటుంది. అటు అశోక్ రుక్మిణిని చంపేందుకు గన్ తీసుకుని ఓ పెద్ద చెట్టు ఎక్కి గురిపెడుతుంటాడు.
బర్తడ్ కేక్‌పై రూప పేరుమాత్రమేఉండటంతో రుక్మిణీ పేరు ఎందుకు రాయించలేదని సూర్య రాజును అడుగుతాడు. ఇంకో కేక్ ఏమైనా తెప్పిస్తున్నావా అంటే లేదని...కావాలనే రూప పేరు మాత్రమే రాయించానని చెబుతాడు. నాకు సంబంధించినంత వరకు రూప,రుక్మిణీలు ఒక్కరేనంటాడు. ఇద్దరూ వేర్వేరు కదా అని విజయాంబిక అంటే...సూర్య అడ్డుకుంటాడు. నా ఇద్దరు కుమార్తెలను ఒక్కటిగా చూస్తుంటే మధ్యలో మీరు కల్పించుకోవద్దని హెచ్చరిస్తాడు. ఇప్పటికే లేట్ అయిపోయిందని...కేక్ కట్ చేద్దామని అనగా రాజు ఒక్క నిమిషం ఆగమంటాడు. కొంతమందిని ఈ బర్త్‌డేకి ఆహ్వానించానని వారు రాగానే కేక్ కట్ చేద్దామని చెబుతాడు. ఎవరు వారని అడగ్గా...అమ్మగారు నడుపుతున్న అనాథ ఆశ్రమంలో ఉండేవాళ్లని చెబుతాడు. ఈ విషయం వినగానే కోమలితోపాటు విజయాంబిక, దీపక్ హడలిపోతారు. అశోక్ ఇంకా రూపను కాల్చి చంపలేదేంటి అని మదనపడిపోతుంటారు. ఈలోగా ఆశ్రమంలో ఉండేవారంతా సూర్య ఇంటిలోకి అడుగుపెడతారు. వాళ్లను చూసి కోమలి భయపడుతుంటుంది.
ఆశ్రమం నుంచి వచ్చిన వాళ్లంతా సూర్యను కలిసి మీతో ఓ ముఖ్య విషయం చెప్పాలని అంటారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామని సూర్య అంటాడు. ఇంతలో అశోక్ గన్ నుంచి రూపను గురిపెట్టి కాల్చుతాడు. అంతలో ఆమె పక్కకు జరగడంతో బుల్లెట్ నేరుగా వెళ్లి కోమలి ఛాతిలో దిగుతుంది. దీంతో వెంటనే ఆమె కిందపడిపోతుంది. ఈ పరిణామంతో అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. ఈ ఊహించని పరిణామం చూసి రుక్మిణి, రాజుతోపాటు ఆశ్రమం నుంచి వచ్చిన వారు కూడా చూస్తూ ఉండిపోతారు. కోమలి సూర్య ఒడిలో పడిపోతుంది. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పిస్తారు. రూపకు ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని సూర్య కన్నీరు పెట్టుకుంటాడు. అక్కను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని...ఆమెకు శత్రువులు ఎవరు ఉండి ఉంటారని రుక్మిణి తండ్రితో అంటుంది. అంతమందిలో గురిచూసి కాల్చాడంటే...అతను ఖచ్చితంగా ప్రొఫెషనల్ షూటర్ అయి ఉంటాడని రాజు అంటాడు. ఇంతలో విరూపాక్షి కల్పించుకుని...షూటర్ తనను చంపాలనే షూట‌్ చేశాడా...లేక వేరొకరిని చంపడానికి కాల్చితే...రూపకు బుల్లెట్ తగిలిందా అని అనుమానిస్తుంది. దీంతో రాజుకు అసలు విషయం అర్థమవుతుంది. వాడు వచ్చింది అమ్మాయిగారిని చంపడానికేనని అనుకోవడంతో ఈ రోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది..





















