Ammayi garu Serial Today August 7th: అమ్మాయి గారు సీరియల్: DNA రిపోర్ట్స్ మార్చింది జీవనా.. కోమలి జీవన్ మనిషా! రూప నిర్ణయమేంటి?
Ammayi garu Serial Today August 7th డీఎన్‌ఏ రిపోర్ట్స్ మార్చింది జీవన్ అని విజయాంబిక, దీపక్‌లకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode డీఎన్‌ఏ రిపోర్ట్స్ పాజిటివ్ రావడంతో అందరూ కోమలిని రూప అని ఫిక్స్ అయిపోతారు. బంటీ రుక్మిణి దగ్గర ఉంటే సూర్యప్రతాప్ పిలిచి మీ అమ్మ తనేరా వెళ్లురా అంటే నేను వెళ్లను తినే మా అమ్మ అని బంటి రుక్మిణిలా ఉన్న అసలైన రూప దగ్గర ఉండిపోతాడు.
సూర్యప్రతాప్‌ని నమ్మించడానికి కోమలి కన్నీరు పెట్టుకుంటుంది. నాన్న వాడు నమ్మే రోజు వస్తుంది అప్పటి వరకు వాడిని ఇబ్బంది పెట్టొద్దు అని అంటుంది. తల్లివి కాబట్టి నువ్వు అర్థం చేసుకున్నావ్ అమ్మా.. అమ్మా రూప అని సూర్యప్రతాప్ కోమలిని హగ్ చేసుకుంటాడు. కోమలి రూప వైపు చూసి కళ్లు ఎగరేస్తుంది. విరూపాక్షి చాలా బాధ పడుతుంది. విజయాంబిక, దీపక్‌లకు కోమలి గుట్టు తెలుసు కాబట్టి ఆ ఎమోషన్స్‌ని చూసి నవ్వుకుంటారు.
విజయాంబిక దీపక్‌ని గదిలోకి తీసుకెళ్లి చితక్కొడుతుంది. తల్లిని అయినా నన్నే టెన్షన్ పెడతావా రిపోర్ట్స్ మార్చి విషయం చెప్పవా అని కొడుకుతుంది. నేను కాదని దీపక్ తల్లి కాళ్లు పట్టుకుంటాడు. విజయాంబిక, దీపక్‌లు నువ్వు కాదు నేను కాదు మరెవరు మార్చారురా అని అనుకుంటారు. ఇంతలో కోమలి వచ్చి మీరు ఇంతగా ప్లాన్ చేస్తారని ఎగిరి గంతేస్తుంది. మీరు గ్రేట్ మిమల్ని ఎత్తి తిప్పాలని ఉందని పొగిడేస్తుంది. నేను ఇంత హ్యాపీగా ఉంటే మీరేంటి ఇలా ఉన్నారని కోమలి అడుగుతుంది. దాంతో దీపక్ నువ్వు అనుకున్నట్లు మేం ఏం చేయలేదు. ఆ రిపోర్ట్స్ మేం మార్చలేదు అని అంటారు.
కోమలి వాళ్లతో రిపోర్ట్స్ మార్చే అవసరం ఎవరికి ఉంది అనుకుంటుంది. ఇంతలో జీవన్ విజయాంబికకు కాల్ చేసి ఆనందంతో ఉండాల్సిన మీరు కంగారుగా ఉన్నారేంటి డీఎన్‌ఏ రిపోర్ట్స్ మారిపోయావి కదా అంటాడు. ఆ విషయం నీకు ఎలా తెలుసు అని విజయాంబిక అడిగితే ఆ రిపోర్స్ నేనే మార్చానని అంటాడు. ఫ్లాష్ బ్యాక్‌లో జీవన్ తన మనిషులతో ఫిట్స్ నాటకం ఆడి రిపోర్స్ మార్చేస్తాడు. ఇదంతా దీపక్, విజయాంబికలు చేసుంటారని మందారం అడిగితే రాజు అలా జరగదు అంటాడు. విరూపాక్షి రూపతో నిజం చెప్పేయమని అంటుంది. రాఘవ దొరికే వరకు ఓపిక పట్టమని అంటారు. ఇంత జరిగినా రూప బయట పడలేదు ఎలా నేను ఏమైపోతానో అని నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అని కోమలి అంటే ఇది సీఎం ఇళ్లు హ్యాపీగా ఉండు అని దీపక్ అంటాడు. నీకు కావాలంటే టైం పాస్‌కి నేను ఉంటానని అంటే విజయాంబిక కోపంగా చూస్తుంది. నువ్వు ఇక్కడే ఉంటే జీవితాంతం తిన్నా తరగని ఆస్తి ఇస్తానని విజయాంబిక అంటుంది. ఇంతలో రాజు రూపలు వస్తారు. రూప అంబికతో ఇస్తావు నీ బాబు సొత్తు కదా ఇస్తావ్ అంటుంది.
విజయాంబిక, దీపక్, కోమలి షాక్ అయిపోతారు. ఎంత బాగా నటించావ్ అత్త.. ఇది ఎవరో తెలీనట్లు ఎప్పుడూ చూడనట్లు ఎంత బాగా నటించావ్ అని నా జీవితంలోని ప్రతీ విషయం అంత క్లారిటీగా ఇది చెప్పింది ఏంటే అనుకున్నా కానీ దీని వెనక నువ్వు ఉన్నావా.. ఇప్పుడే నీ సంగతి చెప్తా అని రూప కోమలి చేయి పట్టుకుంటుంది. నేను రూప కాదని ఏమని నిరూపిస్తావ్ అని కోమలి అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















