అన్వేషించండి

Amitabh Bachchan: కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్ బచ్చన్ - ఇక సెలవంటూ భావోద్వేగం

Amitabh Bachchan: ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై హోస్ట్‌గా ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అమితాబ్ బచ్చన్. కానీ ఫైనల్‌గా ఆ షోకు ఆయన గుడ్ బై చెప్పే టైమ్ వచ్చేసింది.

Amitabh Bachchan Kaun Banega Crorepati: సినిమాలు మాత్రమే కాదు.. బుల్లితెరపై వచ్చే సీరియల్స్, రియాలిటీ షోలు కూడా ప్రేక్షకుల మనసుకు దగ్గరవుతాయి. మామూలుగా బుల్లితెరపై అలరించే సీరియల్స్‌కు చాలానే పాపులారిటీ ఉంటుంది. దానికి సమానంగా కొన్ని షోలకు కూడా అదే విధమైన ప్రాధాన్యత ఇస్తారు ప్రేక్షకులు. అలాంటి వాటిలో ఒకటి ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులకు విజ్ఞాణాన్ని, వినోదాన్ని అందిస్తున్న ఈ షో.. ఆఖరి దశకు చేరుకుంది. ఈ విషయాన్ని స్వయంగా హోస్ట్ అమితాబ్ బచ్చనే బయటపెట్టారు. ఈ షోలోని ఇదే లాస్ట్ ఎపిసోడ్‌ అంటూ ఎమోషనల్‌గా అందరికీ గుడ్ బై చెప్పారు అమితాబ్. గ్రాండ్ ఫినాలేలో అమితాబ్ చెప్పిన మాటలు చాలామందిని కదిలించాయి.

చెప్పడానికి మనసు రావడం లేదు..
‘‘అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు వెళ్లిపోతున్నాను. రేపటి నుంచి ఈ స్టేజ్ ఒకేలా ఉండదు. మనం రేపటి నుంచి ఇక్కడ కలుసుకోము అని చెప్పడం చాలా కష్టంగా ఉంది, చెప్పడానికి మనసు రావడం లేదు. ఈ స్టేజ్‌పై నుంచి మీకు చివరిసారి చెప్పాలనుకుంటున్నాను. శుభరాత్రి’’ అంటూ ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ షోకు ముగింపు పలికారు అమితాబ్ బచ్చన్. ఆ సమయంలో అక్కడే ఉన్న చాలామంది ప్రేక్షకులు.. ఆయన చెప్పిన మాటలు విని ఎమోషనల్ అయ్యారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ హోస్ట్‌గా వ్యవహరించిన అమితాబ్‌ను చాలామంది దేవుడిలాగా భావించేవారు. ఎంతోమంది ఆయన చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ గెలుచుకొని సంతోషంతో ఇంటికి వెళ్లారు.

15 సీజన్స్‌ సక్సెస్‌ఫుల్..
‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ ఇప్పటివరకు 15 సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. 2000 జులై 3న ఈ షోకు సంబంధించిన మొదటి సీజన్‌లోని మొదటి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. అప్పటినుంచి ఇప్పటివరకు 15 సక్సెస్‌ఫుల్ సీజన్స్‌ను పూర్తి చేసుకొని పలువురిని కోటీశ్వరులని, చాలామందిని లక్షాధికారులను చేసింది కేబీసీ. ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ని అమితాబ్ లేకుండా ఊహించుకోలేమని ఈ 15 సీజన్స్‌ను కేవలం ఆయన హోస్టింగ్‌తోనే నడిపించారు మేకర్స్. వెండితెరపై నుంచి అమితాబ్.. బుల్లితెరకు రావడంతో మొదట్లో ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఆయన లేని షోను ఊహించుకోలేకపోయారు. ఈ షో వల్ల బిగ్ బీకు బుల్లితెర ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం..
‘కేబీసీ ఫైనల్ ఎపిసోడ్‌లో అమితాబ్.. ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. నవ్వులు, ప్రేమలు, జ్ఞాపకాలతో కూడిన ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం’ అని సోనీ టీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇదే ఎండింగ్ కాదని.. దీని వల్ల కొత్త బిగినింగ్ కూడా ఉంటుందని సోనీ టీవీ హింట్ కూడా ఇచ్చింది. అమితాబ్ ఈ షోను వదిలి వెళ్లిపోయారంటే.. మరొక హీరో ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ తరువాతి సీజన్స్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తారా లేదా అమితాబ్ లేని షోను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి ఈ షోనే నిలిపివేస్తారా లాంటి వివరాలు తెలియాంటే మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే. ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ షోలో ఇకపై అమితాబ్ లేకపోవడం బాధాకరం అని చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: అలా అనిపించకుండా చేస్తాం అన్నారు - ‘యానిమల్’లో ఇంటిమేట్ సీన్ ఎక్స్‌పీరియన్స్ బయటపెట్టిన తృప్తి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget