అన్వేషించండి

Suma With 90s Middle Class Team: సుమపై శివాజీ అదిరిపోయే పంచ్‌లు - ‘సుమ అడ్డా’లో 90s టీమ్ రచ్చ, నవ్వకుండా ఉండలేరు

Anchor Suma With 90s Middle Class Team: ఓటీటీలకు ఆదరణ పెరగడంతో సినిమాలకు ధీటూగా వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు అలరిస్తున్నాయి.

Anchor Suma With 90s Middle Class Team: ఓటీటీలకు ఆదరణ పెరగడంతో సినిమాలకు ధీటూగా వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు అలరిస్తున్నాయి. మౌత్‌ టాక్‌తోనే ఊహించని విజయం సాధిస్తున్నాయి. కంటెంట్‌ బాగుంటే చాలు సంచలనం అవుతున్నాయి. దీంతో వెబ్‌ సిరీస్‌లకు క్రేజ్‌ పెరిగిపోయింది. అలా మిడిల్‌ కంటెంట్‌తో వచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీ టాక్‌గా మారింది ఓ వెబ్‌ సిరీస్‌. బిజీ బిజీ లైఫ్‌తో పరుగులు తీస్తున్న నేటి తరానికి వెనక్కి తీసుకెళ్లి 90లోని మధుర జ్ఞాపకాలను కళ్లముందుకు తీసుకువస్తోంది ఈ '90s ఏ మిడిల్ క్లాస్' బయోపిక్‌‌.

ప్రస్తుతం 90s కిడ్స్, 2k కిడ్స్ అంటూ సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్ వస్తున్న క్రమంలో ఈ బయోపిక్‌ 90s కిడ్స్‌కి నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చేలా.. ఓ పదిహేనేళ్లు వెనక్కి తీసుకెళ్లి వారి స్కూల్ డేస్‌ను గుర్తు చేస్తోంది. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌, 90s కిడ్సి ఈ వెబ్‌ సిరీస్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. అలా ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా ఓటీటీకి వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు చూసిన 90s ఏ మిడిల్ క్లాస్ క్లిప్సే దర్శనం ఇస్తున్నాయి. 

సుమ అడ్డాలో '90s ఏ మిడిల్ క్లాస్' ఫ్యామిలీ సందడి

సినీ ప్రియులంతా ప్రస్తుతం 90s ఏ మిడిల్ క్లాస్ వెబ్‌ సిరీస్‌ గురించే మాట్లాడుకుంటారు. అంతగా విజయం సాధించిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రధాన పాత్రలు తాజాగా ఓ షో సందడి చేశాయి. యాంకర్‌ సుమ నిర్వహిస్తున్న ప్రముఖలో షో సుమా అడ్డాలో నటుడు శివాజి, నటి వాసుకి, చైల్డ్‌ ఆర్టిస్ట్‌లు అనందం, మౌలి, రోహన్‌లు పాల్గొన్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సుమతో కలిసి శివాజి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌తోత సుమ చేసిన అల్లరి నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. 

ప్రోమో ప్రారంభంలోనే ఎప్పటిలాగే సుమ తన వయసుని కవర్‌ చేసుకునే ప్రయత్నం చేయగా.. శివాజీ తన స్టైల్లో పంచ్‌లు విసిరాడు. "నేను అప్పటి జనరేషన్‌ కాకపోయినా.. 90s ఏ మిడిల్‌ క్లాస్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిందంటూ చెప్పుకురాగా.. అదే.. మీరు మా కంటే ముందు జనరేషన్‌ వారు అయినా.. అని నేను అనను" అంటూ సుమకు నోటికి తాళం వేశాడు. అంతలో శివాజీకి ఫోన్‌ రాగా.. పల్లవి ప్రశాంత్‌ అంటూ సుమ శివాజిని ఆట పట్టించింది. ఇక ప్రొమో మొత్తం సంక్రాంతి పండుగ థీమ్‌ నేపథ్యంలో సాగింది.

ఇందులో సుమ ఫార్నర్‌ క్యారెక్టర్‌ వేయగా 90s ఏ మిడిల్‌ క్లాస్‌ టీం తెలుగు ఫ్యామిలీలా నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండియా వచ్చిన ఫార్నర్‌ సుమ ఇక్క సంప్రదాయాలు, ఎద్దు చూసి ఆశ్చర్యపోతుంటే ఆమెకు వాటి గురించి వివరిస్తుంటాడు శివాజీ అండ్‌ ఫ్యామిలీ. ఈ క్రమంలో వారి మధ్య జరిగే సరదా సంభాషణ, పంచ్‌లు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. సుమా కామెడీ పంచ్‌, డైలాగ్స్‌కి శివాజీ సటైరికల్‌ కామెంట్స్‌ తోడు కావడంతో ప్రోమో మొత్తంగా ఫుల్‌ ఫన్నీగా సాగింది. అలా సుమ అడ్డాలో 90s మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ సంక్రాంతి పండుగ సంబరాలు చూపించారు. 

Also Read: పాపం యశ్ - బాధను మిగిల్చిన బర్త్ డే, రెండు రోజుల్లో నలుగురు మృతి, హీరో వాహనం కిందే పడి..

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Embed widget