Yash: పాపం యశ్ - బాధను మిగిల్చిన బర్త్ డే, రెండు రోజుల్లో నలుగురు మృతి, హీరో వాహనం కిందే పడి..
Yash: కన్నడ హీరో యశ్‌కు తాజా బర్త్ డే అస్సలు కలిసి రాలేదు. యష్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తో ముగ్గురు ఫ్యాన్స్ చనిపోయారు. యశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని మరో ఫ్యాన్ మృతి చెందాడు.
Yash Fans Death: కన్నడ స్టార్ హీరో యశ్ తాజా పుట్టిన రోజు సందర్భంగా తీవ్ర విషాద ఘటనలు జరిగాయి. రెండు రోజుల్లో నలుగురు అభిమానులు చనిపోయారు. ఈ ఘటనల పట్ల యశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు చేయకూడదని అభిమానులకు సూచించారు.
ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తో ముగ్గురు అభిమానులు మృతి
ఈ నెల 8న యశ్ 38వ బర్త్ డే. ఈ సందర్భంగా కర్ణాటక వ్యాప్తంగా ఆయన అభిమానులు బర్త్ డే వేడుకలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు చనిపోయారు. ఈ ఘటన గదగ్ జిల్లా సురనాగి గ్రామంలో జరిగింది. ఈ ఊళ్లో యశ్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయన పుట్టిన రోజుకు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయాపడ్డారు.
యశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని మరో అభిమాని మృతి
తన అభిమానులు చనిపోయారని తెలియడంతో యశ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హాస్పిటల్ కు వెళ్లి గాయపడిన వారిని పలకరించారు. ఘనట జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ మాటలు చెప్పిన కొద్ది సేపటికే మరో అభిమాని చనిపోయాడు. మృతుల కుటుంబాలను, గాయపడిన అభిమానులను పరామర్శించి వస్తుండగా, ఆయన ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఓ యువకుడు చనిపోయాడు. మృతుడు నిఖిల్ గడగ్ తాలూకా బింకదకట్టికి చెందిన వాడు. హాస్పిటల్ నుంచి వెళ్తున్న తన అభిమాన హీరోను చూసేందుకు నిఖిల్ తన స్కూటీ మీద ఆయన వాహనాన్ని ఫాలో అయ్యాడు. అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి, యశ్ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
బర్త్ డే అంటే భయమేస్తుందన్న యశ్
తన పుట్టిన రోజు సందర్భంగా నలుగురు అభిమానులు చనిపోవడంతో యశ్ షాక్ అయ్యారు. పుట్టిన రోజులు జరుపుకోవాలి అంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. మీ చేసే అనాలోచిత పనులు మీ కుటుంబాలని కంటతడి పెట్టించకూడదన్నారు. చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
2004లో సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన యశ్, 2008లో వచ్చిన ‘రాకీ’ మూవీతో హీరోగా ప్రేక్షకుల మందుకు వచ్చారు. ‘2018లో వచ్చిన ‘కేజీఎఫ్’ యశ్ కెరీర్ కు టర్నింగ్ పాయింగ్ గా మారింది. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కేజీఎఫ్ 2’తో దేశ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన హీరోలలో ఒకటిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ‘టాక్సిక్’ అనే సినిమాలో నటిస్తున్నారు.