Trivikram Next Movie: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా బన్నీతో కాదు, ఆ ఇద్దరితో మల్టీస్టారర్?
Trivikram Srinivas Next Movie Is Multi-Starrer?: 'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? టాలీవుడ్ లేటెస్ట్ టాక్ ఏమిటంటే?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమా వచ్చి ఎన్నాళ్ళు అయ్యింది? ఈ సంక్రాంతికి నాలుగు సంవత్సరాలు. 'అల వైకుంఠపురములో' సినిమా జనవరి 12, 2020లో విడుదలైంది. సంక్రాంతి పండక్కి సందడి చేసింది. ఈ సంక్రాంతికి, జనవరి 12న 'గుంటూరు కారం'తో థియేటర్లలోకి వస్తున్నారు. అల, గుంటూరు... ఈ రెండిటి మధ్యలో త్రివిక్రమ్ రచయితగా పని చేసిన సినిమాలు ఉన్నాయి. అయితే, దర్శకుడిగా ఆయనకు గ్యాప్ వచ్చింది. ఈసారి అటువంటి గ్యాప్ రాకుండా ఉండాలని త్రివిక్రమ్ ప్లాన్ బి రెడీ చేసి పెట్టుకున్నారట.
'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి?
'అల వైకుంఠపురములో' సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' విడుదలైంది. సంక్రాంతి 2020 బరిలో ఆ రెండు సినిమాలు సందడి చేశాయి. ఆ తర్వాత మహేష్ 'సర్కారు వారి పాట' చేశారు. కానీ, త్రివిక్రమ్ మరొక సినిమా చేయలేదు. 'గుంటూరు కారం' విడుదలకు ముందు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. అయితే, ఆ ప్లాన్ కొంచెం మారుతోందని టాలీవుడ్ టాక్.
ప్రజెంట్ 'పుష్ప 2' షూటింగ్‌లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఆగస్టులో ఆ సినిమా విడుదల కానుంది. అప్పటి వరకు ఆయన ఫ్రీ కావడం కష్టం. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. 'పుష్ప 2' పూర్తైన వెంటనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని చెప్పలేం. కానీ, బన్నీ లైనప్, డైరీ ఫుల్ అయ్యింది. 'గుంటూరు కారం', 'పుష్ప 2' విడుదల మధ్య ఎనిమిది నెలలు గ్యాప్ ఉంది. అందుకని, ఈ టైంలో మరో సినిమా చేస్తే ఎలా ఉంటుందని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారట! ఆయన దగ్గర చాలా కథలు ఉన్నాయి. అందులో మల్టీస్టారర్ సబ్జెక్ట్ కూడా ఉంది. దానిని సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నారట.
వెంకటేష్, నాని హీరోలుగా త్రివిక్రమ్ మల్టీస్టారర్!
విక్టరీ వెంకటేష్, న్యాచురల్ స్టార్ నాని హీరోలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మల్టీస్టారర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. వెంకీతో ఆయన కాంబినేషన్ సూపర్ హిట్. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలతో రచయితగా త్రివిక్రమ్ పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు అయ్యాక వెంకీతో సినిమాలు చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కుదరలేదు. ఇన్నాళ్ళకు ఆ కాంబినేషన్ వర్కవుట్ అయ్యేలా ఉంది.
Also Read: యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ vs సింగర్ సునీత కొడుకు ఆకాష్... ఇద్దరిలో ఎవరు బెటర్?
వెంకటేష్ కోసం త్రివిక్రమ్ కొన్నాళ్ళ క్రితం ఓ కథ రాసుకున్నారు. అయితే, ఆ కథలో ఇప్పుడు మార్పులు చేశారట. అందులో మరొక హీరోకి చోటు కల్పిస్తూ మల్టీస్టారర్ కథగా మార్చరట. మరో హీరో పాత్రకు నానిని సంప్రదించారట. వెంకీతో సినిమాకు నాని కూడా సై అన్నారట. అయితే... ఇప్పుడీ వివరాల్ని బయటకు చెప్పడం లేదు. బన్నీతో సినిమా లేట్ అయితే ఇది సెట్స్ మీదకు వెళుతుంది. లేదంటే కొంత ఆలస్యం అవుతుంది. అందుకని, త్రివిక్రమ్ అన్నీ రహస్యంగా ఉంచుతున్నారు.
Also Read: ఆ ఓటీటీలో 'హనుమాన్' - థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు స్ట్రీమింగ్ అవుతుందంటే?