Trisha: ‘ఐడెంటిటీ‘ టీమ్‌తో త్రిష జాయిన్, అదిరిపోయే యాక్షన్ వీడియో చూశారా?
Trisha: వరుసగా సినిమాలతో దూసుకెళ్తోంది స్టార్ హీరోయిన్ త్రిష. ప్రస్తుతం మలయాళ సినిమా ‘ఐడెంటిటీ’లో నటిస్తోంది. తాజాగా షూటింగ్ కు హాజరైన ఆమె, అదిరిపోయే యాక్షన వీడియోను అభిమానులతో పంచుకుంది.
Trisha Krishnan Starts Shooting For ‘Identity’: సీనియర్ హీరోయిన్ త్రిష చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఓ వైపు గ్లామరస్ పాత్రల్లో అందాలు ఆరబోస్తూనే, మరోవైపు నటనా ప్రాధాన్య ఉన్న పాత్రల్లోనూ నటిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ లీడింగ్ సినిమాల్లో నటిస్తూ కొత్త హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ ఏడాది మణిరత్నం ప్రతిష్టాత్మ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ 2’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది ఈ చెన్నై బ్యూటీ. రీసెంట్ గా దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కి ‘లియో’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, వసూళ్ల పరంగా సత్తా చాటింది.
‘ఐడెంటిటీ’ షూటింగ్ లో త్రిష జాయిన్
ఇక ‘లియో’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘ఐడెంటిటీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు టోవినో థామస్‌తో జోడీ కడుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ లోకి అడుగు పెట్టింది. హీరోతో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నది. ఈ సినిమాకు సంబంధించి తన తొలి రోజు షూటింగ్ వివరాలను తెలియజేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో భారీ యాక్షన్ సన్నివేశాల్లో హీరోతో కలిసి త్రిష పాల్గొన్నది. కార్ ఛేజింగ్ సీన్లను మేకర్స్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ లో త్రిష ఉత్సాహం పాల్గొన్నది. ఈ చిత్రంలో భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె వెల్లడించింది.
View this post on Instagram
45 రోజుల పాటు డేట్స్ కేటాయించిన త్రిష
ఇక ‘ఐడెంటిటీ’ సినిమా మలయాళంలో తెరకెక్కుతోంది. ‘2018’ ఫేమ్ టోవినో థామస్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అఖిల్ పాల్, అనస్ ఖాన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా అనుకున్నట్లుగానే త్రిష డిసెంబర్ మూడో వారంలో షూటింగ్ లో పాల్గొన్నది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె సుమారు 45 రోజుల పాటు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. యాక్షన్, థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. త్రిష కూడా ఈ చిత్రంలో పెద్ద ఎత్తున యాక్షన్ సన్నివేశాల్లో భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. కాగా నివిన్ పౌలి ‘హే జూడ్’, మోహన్‌లాల్ ‘రామ్’ తర్వాత మలయాళంలో త్రిష చేస్తున్న మూడో చిత్రం ‘ఐడెంటిటీ’.
సంచలనం సృష్టించిన మన్సూర్ వ్యాఖ్యల వివాదం
ఇక ‘లియో’ సినిమా తర్వాత త్రిష బాగా వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆమె గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కామెంట్స్ కేసులు, కోర్టులు, పరువు నష్టం దావా వరకు వెళ్లాయి. తాజాగా మన్సూర్ అలీ ఖాన్ ను మద్రాసు హైకోర్టు తీవ్రంగా మందలించి కేసును కొట్టివేసింది. పనిలో పనిగా రూ. లక్ష జరిమానా కూడా విధించడంతో వివాదం సద్దుమణిగింది.
Read Also: 90 రోజులు, 600 మంది హాలీవుడ్ టెక్నీషియన్లు, ‘కన్నప్ప’ కోసం అంత కష్టపడ్డారా?