అన్వేషించండి

చిరంజీవి ఇంట్లో మెగా దీపావళి, 'సలార్' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

చిరంజీవి ఇంట్లో మెగా దీపావళి - ఎన్టీఆర్, చరణ్ మళ్ళీ కలిశారు, గొడవలు లేనట్లే!
తెలుగు చిత్రసీమలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో శనివారం రాత్రి జరిగిన దీపావళి పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరోలు, వాళ్ళ భార్యలు సైతం హాజరు అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులతో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి కూడా ఆ పార్టీలో సందడి చేశారు. యువ హీరోలతో తోడు విక్టరీ వెంకటేష్ కూడా కలిశారు. తెలుగు చిత్రసీమలో హీరోల మధ్య మంచి స్నేహం ఉంది. ఇంతకు ముందు ఓసారి ఇదే విధంగా జరిగిన పార్టీలో మహేష్, ఎన్టీఆర్, చరణ్ సందడి చేశారు. ఎన్టీఆర్, చరణ్ అయితే 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో కలిసి నటించారు కూడా! అయితే... ఆ సినిమా విడుదల తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చాలా పుకార్లు షికార్లు చేశాయి. దీపావళి పార్టీతో వాటికి చెక్ పడినట్లు చెప్పవచ్చు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అఫీషియల్ - 'సలార్' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు 'సలార్' టీమ్ దీపావళి కానుక అందించింది. సినిమా నుంచి హీరో సరికొత్త స్టిల్ విడుదల చేసింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... గన్ పట్టుకుని స్లిమ్ అండ్ స్టైలిష్ ఫోజులో ప్రభాస్ సూపర్ ఉన్నారు. యాక్షన్ సీక్వెన్స్ నుంచి తీసిన స్టిల్ అని అర్థం అవుతోంది. డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ విడుదల కానుందని రెండు మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అది నిజమే అని ఈ రోజు క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఆ రోజు రాత్రి 7.19 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నిర్వాహకుల అత్యుత్సాహం, అల్లు అర్జున్​కు ట్రోలింగ్ తలనొప్పి!
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఓ రేంజిలో పెరిగిపోయింది. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా భారీగా ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు. ఆయన నటన, స్టైల్ కు సినీ అభిమానులు బాగా అట్రాక్ట్ అయ్యారు. నిజం చెప్పాలంటే ‘అలవైకుంఠపురంలో’ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక ‘పుష్ప’ సినిమాతో మరింత ఎత్తుకు ఎదిగారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ హీరోకు దక్కని అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకుని సత్తా చాటారు. ‘పుష్ప’ సినిమాలోని అద్భుత నటనకు గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పుష్ప 2’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  ‘పుష్ప’ను మించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రజనీకాంత్ దీపావళి ట్రీట్, ‘లాల్ సలామ్‘ ట్రైలర్ విడుదల, డిఫరెంట్ లుక్​లో ఆకట్టుకున్న సూపర్ స్టార్
‘జైలర్’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌. అదే ఊపులో వరుస సినిమాలో చేస్తున్నారు. తాజాగా ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ అనే సినిమా చేస్తున్నారు.  విష్ణువిశాల్‌, విక్రాంత్‌ లీడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘లాల్‌ సలామ్‌’ టైటిల్ పోస్టర్‌ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎన్టీఆర్ అభిమానులకు సారీ - హృతిక్ రోషన్ ఉన్నాడు కానీ?
బాలీవుడ్ సినిమా 'టైగర్ 3' కోసం టాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూడడానికి ఓ కారణం మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. సల్మాన్ ఖాన్ సినిమా అయినప్పటికీ... తెలుగులో మాస్ ప్రేక్షకుల వరకు 'టైగర్ 3' చేరింది. ఎందుకంటే... మన ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనువిందు చేస్తారని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరగడం! దానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. భారతీయ గూఢచారిగా సల్మాన్ ఖాన్ (Salman Khan) మరోసారి సందడి చేసిన సినిమా 'టైగర్ 3'. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు 'టైగర్ 3'లో ఎన్టీఆర్ లేరని కన్ఫర్మ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Ind Vs Aus Series: అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Embed widget