మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్రో'. పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. మెగా మేనమామ-మేనల్లుడు మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో లేటెస్టుగా వచ్చిన సాయి తేజ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అఖిల్‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యువి క్రియేషన్స్ విక్రమ్ రెడ్డితో కలిసి `వీ మెగా పిక్చర్స్` అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తాజాగా వీరితో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ సైతం జతకట్టారు. ఈ ముగ్గురు కలిసి ఓ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ ను ఓ వీడియో రూపంలో విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్ సైతం విడుదల చేశారు. ఈ పోస్టర్ ను చూసిన ప్రతి ఒక్కరు అఖిల్ హీరోగా చేయబోతున్నట్లు భావించారు. ‘ఏజెంట్’ ఫ్లాప్ అయినా, ఓ మంచి అవకాశం దొరికినట్లు భావించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామాయణం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఆయన సతీమణి సీతాదేవిగా బాలీవుడ్ నటి కృతి సనన్ నటిస్తోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త్ నాగే, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అభిమానులు ఎంతో అద్భుతంగా అలరించింది. ట్రైలర్లో రాముడిగా ప్రభాస్ లుక్స్ తో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ అందరినీ ఆకట్టుకోవడంతో ట్రైలర్ ఒక్కసారిగా సినిమా పై అంచనాలను పెంచేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా, ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. సుమారు 75 శాతం షూటింగ్ పూర్తి కాగా, 25 శాతం పెండింగ్ లో ఉంది. ఈ సినిమా కంప్లీట్ కావాలంటే కనీసం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ‘, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్, సాయి ధరమ్ తేజ్‌తో ఒక చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాలకు సంబంధించిన ఒకటి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ కంప్లీట్ చేయాలి అనుకున్నారు పవన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
సరికొత్త కాన్సెప్ట్స్ తో, విజువల్స్ తో వండర్స్ చేస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హనుమాన్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఏకంగా 11 భాషల్లో విడుదలకానుంది. ఆయన పుట్టిన రోజు(మే 29) సందర్భంగా ‘హనుమాన్’ ప్రాజెక్టుతో పాటు తన డ్రీమ్ మూవీస్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)