అన్వేషించండి

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా 'బ్రో'. ఇప్పటికే టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుండగా, తాజాగా మామా అల్లుళ్లు కలిసి ఉన్న సూపర్ డూపర్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్రో'. పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. మెగా మేనమామ-మేనల్లుడు మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో లేటెస్టుగా వచ్చిన సాయి తేజ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది.

బ్రో మూవీ నుంచి సాలిడ్  పోస్టర్ విడుదల

‘బ్రో’ సినిమా నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ కలిసి ఉన్న సాలిడ్ పోస్టర్  ను మేకర్స్ రివీల్ చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఇవాళ(మే 29న) ఉదయం 10.08 నిమిషాలకు పోస్టర్ రిలీజ్ చేశారు.  ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులతో పాటు సాయి తేజ్ అభిమానులు సైతం ఇద్దరూ కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేయాలని కొద్ది రోజులుగా మేకర్స్ ను కోరుతున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ పోస్టర్ ను విడుదల చేశారు.  పవన్ బైక్ మీద కాలు పెట్టి నిలబడగా, ఆయన మోకాలు మీద చెయ్యిపెట్టి సాయి తేజ్ నిలబడి కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కీలక మార్పులు

'బ్రో' అనేది 'వినోదయ సీతం' అనే తమిళ్ చిత్రానికి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే. దేవుడు - భక్తుడి మధ్య ఆసక్తికరమైన కథాంశంతో సముద్రఖని ఈ సినిమాజని రూపొందించారు. ఇందులో స‌ముద్ర ఖ‌ని - తంబి రామ‌స్వామి ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ ఇక్కడ బ్రో విషయానికొస్తే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా త్రివిక్రమ్ పలు మార్పులు చేర్పులు చేసారు. ఒరిజినల్ సినిమా నుంచి మెయిన్ ప్లాట్ ని మాత్రమే తీసుకున్నారనే టాక్ ఉంది. ఇందులో పవన్ ను మోడరన్ గాడ్ గా చాలా స్టైలిష్ గా చూపించనున్నారు. అతను టైమ్ ఆఫ్ గాడ్ పాత్రను పోషిస్తున్నప్పటికీ, BRO మోషన్ పోస్టర్‌ లో శివుడి గురించి ప్రస్తావించడాన్ని గమనించవచ్చు. మరోవైపు సాయి తేజ్ పాత్రను మాత్రం మాతృకకు కాస్త భిన్నంగా తీర్చిదిద్దుతున్నారని టాక్. మార్కండేయులు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 

జూలై 28న ‘బ్రో’ సినిమా విడుదల

కాగా, 'బ్రో' చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్ర ఖని, రోహిణి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నర్రా శ్రీను, అలీ రెజా ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  'బ్రో' సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని జూలై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

Read Also: కమల్‌ హాసన్‌ కామెంట్స్‌కు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కౌంటర్

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget