అన్వేషించండి

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం'ఆదిపురుష్'. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు అందరినీ అలరిస్తున్నాయి. తాజాగా ‘రామ్ సీతా రామ్’ అనే మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామాయణం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఆయన సతీమణి సీతాదేవిగా బాలీవుడ్ నటి కృతి సనన్ నటిస్తోంది. లక్ష్మణుడిగా ​ సన్నీ సింగ్​, హనుమంతుడిగా దేవదత్త్​ నాగే, రావణాసురుడిగా సైఫ్​ అలీ ఖాన్​ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అభిమానులు ఎంతో అద్భుతంగా అలరించింది.  ట్రైలర్లో రాముడిగా ప్రభాస్ లుక్స్ తో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ అందరినీ ఆకట్టుకోవడంతో ట్రైలర్ ఒక్కసారిగా సినిమా పై అంచనాలను పెంచేసింది.

కనువిందు చేస్తున్న‘రామ్ సీతా రామ్’ సాంగ్  

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు సినీ అభిమానులను అద్భుతంగా అలరించాయి. తాజాగా ఈ సినిమాలోని ‘రామ్ సీతా రామ్’  అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. రాఘవుడు, సీత మధ్య సంభాషణతో ప్రారంభమైన ఈ సుమనోహర గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీనుల విందుగా కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ఓ రేంజిలో వైరల్ గా మారింది. ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అద్భుమైన విజువల్ వండర్ గా ఈ పాటను రూపొందించారు.

రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’

ఇక ఈ సినిమా రామాయణం ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాను రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్​ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం పోస్టర్లు, పాటలు విడుదల చేస్తున్నారు.  

టీజర్ విడుదల తర్వాత తీవ్ర విమర్శలు

వాస్తవానికి 'ఆది పురుష్' టీజర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగించినా.. సినిమా టీజర్ మాత్రం ఏదో కార్టూన్ సినిమా చూస్తున్నట్టే అనిపించిందని చాలా మంది ఆరోపించారు. అనుకున్న స్థాయిలో గ్రాఫిక్స్ కుదరకపోవడం, ఈ సమయంలోనే మూవీపై వివాదాస్పద కామెంట్లు రావడం 'ఆది పురుష్' రిలీజ్ పై తీవ్రంగా ప్రభావం చూపాయి. ‘ఆది పురుష్’ను మొదటగా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన మేకర్స్.. సినిమాలోని గ్రాఫిక్స్ పై వచ్చిన విమర్శలను చూసి..  గ్రాఫిక్స్ పనులను మళ్లీ చేయించారు.  దీంతో ఈ సినిమా మరింత లేట్ అయింది. దీంతో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ భారీ చిత్రాన్ని జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

పీపుల్స్ మీడియా చేతికి 'ఆదిపురుష్'

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల 'ఆదిపురుష్' థియేట్రికల్ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ. 170 కోట్లకు ఈ రెండు రాష్ట్రాల రైట్స్ ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్నది. తెలుగులో జరిగిన భారీ థియేట్రికల్ రైట్స్ డీల్స్ చూస్తే... 'ఆర్ఆర్ఆర్' రెండు రాష్ట్రాల హక్కులు సుమారు రూ. 226 కోట్లకు విక్రయించారు. 'బాహుబలి 2' అయితే రూ. 120 కోట్లకు, 'సాహో' రూ. 124 కోట్లకు విక్రయించారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్థానం 'ఆదిపురుష్' దక్కించుకుంది.

Read Also: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Embed widget