By: ABP Desam | Updated at : 29 May 2023 01:05 PM (IST)
Photo Credit: Prasanth Varm/twitter
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తొలి పాన్ వరల్డ్ మూవీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంజనాద్రి అనే కాల్పనిక ప్రదేశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హను మాన్‌లా శక్తులు పొందిన సామాన్యుడు అంజనాద్రిని కాపాడుకోవడానికి ఏం చేశాడనే నేపథ్యంలో ఈ కథ ఉండబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజ్ అప్ డేట్ వచ్చింది.
వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా, పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అందుకు ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్ వర్క్. వీఎఫ్‌ఎక్స్ పనుల్లో జాప్యం కారణంగా మేకర్స్ విడుదలను వాయిదా వేస్తున్నారు. ఈ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉంటాయని తాజాగా తెలిసింది. అత్యుత్తమ నాణ్యత గల VFXని అందించడానికి చిత్ర బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా, ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. జూన్ చివరకు అవి పూర్తయ్యే అవకాశం ఉంది. జూలైలో సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
వాస్తవానికి ‘హనుమాన్’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. అందుకే, అనుకున్నదాని కంటే మరికొంత మెరుగ్గా సినిమాను తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు, అద్భుతమైన అవుట్ పుట్ వచ్చేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమాలోని ఒక్కో అంశాన్ని ఒక్కో కంపెనీ వాళ్లు వీఎఫ్‌ఎక్స్ చేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ కు చాలా సమయం పడుతుందన్నారు. సమయం తీసుకుని చేస్తే ప్రతి సన్నివేశం చక్కగా వస్తుందన్నారు. ఇప్పటికే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. ‘‘హనుమాన్’ టీజర్‌పై మీరు చూపించిన ప్రేమ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. మా హృదయాలను హత్తుకుంది. సినిమా విషయంలో మాపై బాధ్యత మరింత పెరిగింది. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేలా, హనుమంతుడి స్ఫూర్తికి అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. వెండితెరపై ‘హనుమాన్’ను మీకు చూపించేందుకు మేము ఆతురతగా ఉన్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని ఆయన తెలిపారు.
‘హనుమాన్’ చిత్రాన్ని పాన్ వరల్డ్ యూవీగా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏకంగా 11 భాషల్లో విడదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ సహా 11 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
Read Also: అఖిల్‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
/body>