Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Maharastra: మహారాష్ట్ర ప్రభుత్వంలో పదమూడు వేలకు పని చేసే ఉద్యోగి హఠాత్తుగా కుబేరుడయ్యాడు. అతనిది లంచాలు వచ్చే ఉద్యోగం కూడా కాదు. మరి ఎలా ో?
Maharastra government employee with Rs 13000 salary bought BMW gifted 4BHK to girlfriend: లగ్జరీ బీఎండబ్ల్యూ కారు కనీసం కోటి రూపాయలు ఉంటుంది. అదే నాలుగు బెడ్ రూం అపార్టుమెంట్ అయితే కనీసం రెండు కోట్లు ఉంటుంది. వీటిని కొనాలంటే ఎంత సంపాదించాలి ?. ఈ ఎంఐలలో కొనాలన్నా నెలకు ఐదు లక్షల రూపాయలు సంపాదించాలి. కానీ నెలకు పదమూడు వేల రూపాయల ఆదాయం ఉన్న హర్షకుమార్ అనే యువకుడు వీటిని కొనేశాడు. ఆదాయం ఎక్కడితో అమ్మే వాళ్లకు అనవసరం కొనేశాడు. వాటిలో ఇల్లు గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. అతన్ని చూసి అందరూ లక్కీ భాస్కర్ అనుకోవడం ప్రారంభించారు. కానీ సినిమాలో ఉన్నట్లుగా లక్కీ ఎప్పుడూ ఉండదు. ఒక్కోసారి బ్యాడ్ లక్ గా మారిపోతుంది.
హర్షకుమార్ కు కూడా లక్ ఉన్నంత కాలం ఉంది. తర్వాత అడ్డం తిరిగింది.దాంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతకూ హర్ష్ కుమార్ కు డబ్బులు ఎక్కడిడ నుంచి వచ్చాయనుకున్నారు ?. అతనేమీ లంచాలు వచ్చే పోస్టులో లేడు. లాటరీ కొట్టలేదు. మరి ఎక్కడ నుంచి వస్తాయి. బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకున్నాడు. పదమూడు వేలు వచ్చే అతని అకౌంట్లో పెద్దగా డబ్బులు ఉండవని తెలుసుకాబట్టి ప్రభుత్వ ఖజానా నుంచే కొట్టేశాడు. హర్ష్ కుమార్ క్రీడా శాఖలోని అసిస్టెంట్ కమిషనల్ ఆఫీసులో పని చేసేవాడు.
Also Read: Serial Killer : 18 నెలల్లో 11మంది హత్య - పురుషులనే టార్గెట్ చేసిన సీరియల్ కిల్లర్.. అసలు కథ ఇదే
మహారాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. ఆ నిధులు ఖాతాల్లో ఉన్నాయి. హర్ష కుమార్ తన కొలీగ్ అయిన యశోదాషెట్టి, ఆమె భర్తతో కలిసి ప్లాన్ వేశాడు. ప్రభుత్వ ఖాతాల్లోని డబ్బులు కాజేస్తే ఎవరికీ లెక్క తెలియదని అనుకున్నారు. వెంటనే ఆన్ లైన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. స్పోర్ట్స్ డిప్యూటీ కమిషనర్ వీరి తీరును పెద్దగా అనుమానించలేదు. చాలా ఈజీగా ఆన్ లైన్ అకౌంట్ ను క్రియేట్ చేసుకుని డబ్బులు తమ ఖాతాలకు జమ చేసుకోవడం ప్రారంభించారు. ఆరు నెలల పాటు ఇలా నిరాటంకంగా సాగిపోయింది. హర్షకుమార్ తనకు బిఎండబ్ల్యూ కారు కొన్నారు. గర్ల్ ఫ్రెండ్ కు నాలుగు బెడ్ రూంల ఇల్లు కొనిచ్చాడు.
కానీ లక్కీ భాస్కర్ లో చెప్పినట్లుగా ఎక్కడో చోట దొరికిపోవాల్సిందే. దొరికిపోవడానికన్నా ముందే ఆపేసి పారిపోవావాలి. కానీ వీళ్లకు అయాచితంగా వస్తున్న డబ్బులను తీసుకోవడామే కానీ ఆపాలని అనుకోలేదు. ఓ రోజు స్పోర్ట్స్ కాంప్లక్స్ కు బిల్లులు చెల్లించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.దాంతో ప్రభుత్వ వర్గాలు ఆరా తీశాయి. లెక్కా పత్రం లేకుండా ఓ ఉద్యోగి తన ఖాతాకు మళ్లించుకున్నాడని గుర్తించారు. ఆ మేరకు పోలీసులుకేసు నమోదు చేసుకుని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.