వార్ 2 అప్‌డేట్, జైశ్రీరాం సాంగ్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
యుద్ధభూమిలో కలుద్దాం మిత్రమా - ఎన్టీఆర్‌తో 'వార్ 2', హింట్ ఇచ్చేసిన హృతిక్!
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ (Jr NTR) ఎన్టీఆర్ హిందీలో ఓ భారీ యాక్షన్ సినిమా చేయడానికి 'ఎస్' చెప్పారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్, యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ ఫిల్మ్ 'వార్' సీక్వెల్ 'వార్ 2' (War 2 Movie)లో ఎన్టీఆర్ నటించనున్నారు. ఇంకా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, హృతిక్ హింట్ ఇచ్చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సకల మంత్రముల శక్తి సారం, భక్తుల హృదయ నాదం - 'జై శ్రీరామ్', సాంగ్ విన్నారా?
ప్రభు శ్రీరామ చంద్రుని పాత్రలో ప్రభాస్ (Prabhas) నటించిన చిత్రం 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ జోడీగా, జానకి అలియాస్ సీత దేవి పాత్రలో కృతి సనన్ నటించారు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న త్రీడీలో సినిమా విడుదల కానుంది. ఈ రోజు సినిమాలో తొలి పాటను విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ - మార్చిలో NTR 31 షురూ, ట్విస్ట్ ఏంటంటే?
పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘NTR31’ తెరకెక్కనుంది. యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 2024లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఎన్టీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తూ ఈ ప్రకటన చేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. గత ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన పోస్టర్ ను వదిలారు. అది ఏ రేంజ్ లో ఉందో మాటల్లో చెప్పలేం. చాలా క్రూరంగా కనిపిస్తున్నారు ఎన్టీఆర్. ఈ పోస్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. పోస్టరే ఇలా ఉందంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఏపీ, తెలంగాణలో దుమ్ము రేపిన 'బిచ్చగాడు 2' - విజయ్ ఆంటోనీ సినిమా ఓపెనింగ్స్ ఎంతంటే?
'బిచ్చగాడు'తో రికార్డు సృష్టించి, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేసిన హీరో విజయ్ ఆంటోనీ... ఇప్పుడు 'బిచ్చగాడు 2'తో ఆ రికార్డులను కొనసాగించారు. మూవీ విడుదలైన తొలి రోజే రూ. 4.5 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
తెలుగు సినిమా టీజర్ మెచ్చిన ఏబీ డివిలియర్స్ - నీరోజ్‌కు ఆల్ ది బెస్ట్!
ప్రముఖ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (AB De Villiers) భారతీయులకు తెలుసు. సౌత్ ఆఫ్రికా క్రికెటర్ అయినప్పటికీ... ఐపీఎల్ ద్వారా ఇక్కడి జనాలకు దగ్గర అయ్యారు. ఓ తెలుగు సినిమా టీజర్ బావుందని ఆయన వీడియో విడుదల చేశారు. అందులో హీరో నీరోజ్ పుచ్చాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)