అన్వేషించండి

Pradeep Machiraju: బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం

Pradeep Machiraju : ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు చాలా రోజుల తరువాత మళ్లీ బుల్లితెరపై యాంకర్ గా సందడి చేయబోతున్నారు. తాజాగా రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రోమోలో మెరిశారు ప్రదీప్.

స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన స్టైలిష్ లుక్స్, కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ యాంకర్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా బుల్లితెరకు దూరంగా ఉంటూ వస్తున్న ప్రదీప్, తాజాగా మరోసారి యాంకర్ అవతారం ఎత్తారు. ఎప్పటిలాగే తాజాగా 'మా సంక్రాంతి వేడుక' అంటూ బుల్లితెరపై సందడి చేశారు.  

'మా సంక్రాంతి వేడుక' అంటూ సందడి...  

త్వరలోనే సంక్రాంతి వేడుకలు మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు టెలివిజన్ షోలు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా 'స్టార్ మా'లో 'మా సంక్రాంతి వేడుక' అనే షోను సంక్రాంతి కానుకగా జనవరి 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, అందులో ప్రదీప్ రీఎంట్రీ ఇస్తున్నట్టు ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశారు. చాలా కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటూ వస్తున్న ప్రదీప్ మరోసారి శ్రీముఖితో కలిసి హోస్ట్ గా 'మా సంక్రాంతి వేడుక' షోలో అదరగొట్టారు. ఈ పండగ బ్లాక్ బస్టర్ అంటూ పలువురు బుల్లితెర సెలబ్రిటీతో పాటు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఇందులో సందడి చేశారు. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... ఈ షోకి విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా విచ్చేశారు.

వెంకీ మామ గెస్ట్ గా... 

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రమోషన్ లో భాగంగా వెంకటేష్ 'మా సంక్రాంతి వేడుక' అనే ఈ బుల్లితెర షోలో సందడి చేశారు. "మన ముందు వెంకీ మామ ఉండగా... దద్దరిల్లిపోద్ది ఈ సంక్రాంతి పండుగ" అంటూ వెంకటేష్ కి వెల్కమ్ చెప్పింది శ్రీముఖి. "ఇట్స్ యన్ ఆటిట్యూడ్ పొంగల్" అంటూ 'సంక్రాంతికి వస్తున్నాం' సాంగ్ తో వెంకటేష్ ఎంట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత వెంకటేష్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ వేదికపై సెటైర్లు వేస్తూ సందడి చేశారు. ఇక ఇందులో భాగంగానే "ప్రదీప్ మాచిరాజు సింగిల్ ఆర్ కమిటెడ్" అంటూ ఇరికించింది. శ్రీముఖి. వెంటనే ప్రదీప్ "సింగిలే అండి" అని సమాధానం చెప్పగా, వెంకటేష్ రియాక్ట్ అవుతూ "నిజమా... అవునా" అనే మీమ్ ను తనదైన శైలిలో చెప్పి అందరిని నవ్వించారు.

Also Read: ఈటీవీలో కొత్త సీరియల్... 'ఝాన్సీ' టెలికాస్ట్ టైమింగ్ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?

పవన్ కళ్యాణ్ టైటిల్ తో ప్రదీప్ మాచిరాజు...

ఇక ఇప్పటికే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ మాచిరాజు, మూడేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా సెకండ్ మూవీని మొదలు పెట్టారు. ప్రదీప్ మాచిరాజు సెకండ్ సినిమాకు పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ 'ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి' అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఈ మూవీలో యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్ గా నటిస్తుండగా, నితిన్ - భరత్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసమే ప్రదీప్ మాచిరాజు చాలా రోజులుగా టీవీ షోలకు దూరంగా ఉంటున్నట్టు వార్తలు వినిపించాయి.

Also Readనయనతార, నెట్‌ఫ్లిక్స్‌పై 'చంద్రముఖి' నిర్మాతలు సీరియస్‌ అయ్యారా? లీగల్ నోటీసులు ఇచ్చారా? అసలు నిజం ఏమిటంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Death Penalty For Sanjay Roy: ఆర్జీ కర్ అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష విధించండి- హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
Death Penalty For Sanjay Roy: ఆర్జీ కర్ అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష విధించండి- హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
Chandrababu at Davos: దావోస్‌లో చంద్రబాబు పెట్టుబడుల వేట, లక్ష్మీమిట్టల్‌తో భేటీ -పెట్రో కెమికల్ హబ్‌లో పెట్టుబడులకు ఆహ్వానం
దావోస్‌లో చంద్రబాబు పెట్టుబడుల వేట, లక్ష్మీమిట్టల్‌తో భేటీ -పెట్రో కెమికల్ హబ్‌లో పెట్టుబడులకు ఆహ్వానం
Kalki 2898 AD Part 2: 'కల్కి 2868 ఏడీ పార్ట్ 2' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత... ఒకేసారి ప్రభాస్ 3 సినిమాలు సెట్స్ మీదకు?
'కల్కి 2868 ఏడీ పార్ట్ 2' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత... ఒకేసారి ప్రభాస్ 3 సినిమాలు సెట్స్ మీదకు?
Donald Trump Key Decisions: మెక్సికో, కెనడాకు బిగ్ షాక్ - ట్రంప్ సంతకాలతో అమెరికాలో ఏం మారనున్నాయంటే!
మెక్సికో, కెనడాకు బిగ్ షాక్ - ట్రంప్ సంతకాలతో అమెరికాలో ఏం మారనున్నాయంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Death Penalty For Sanjay Roy: ఆర్జీ కర్ అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష విధించండి- హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
Death Penalty For Sanjay Roy: ఆర్జీ కర్ అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష విధించండి- హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
Chandrababu at Davos: దావోస్‌లో చంద్రబాబు పెట్టుబడుల వేట, లక్ష్మీమిట్టల్‌తో భేటీ -పెట్రో కెమికల్ హబ్‌లో పెట్టుబడులకు ఆహ్వానం
దావోస్‌లో చంద్రబాబు పెట్టుబడుల వేట, లక్ష్మీమిట్టల్‌తో భేటీ -పెట్రో కెమికల్ హబ్‌లో పెట్టుబడులకు ఆహ్వానం
Kalki 2898 AD Part 2: 'కల్కి 2868 ఏడీ పార్ట్ 2' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత... ఒకేసారి ప్రభాస్ 3 సినిమాలు సెట్స్ మీదకు?
'కల్కి 2868 ఏడీ పార్ట్ 2' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత... ఒకేసారి ప్రభాస్ 3 సినిమాలు సెట్స్ మీదకు?
Donald Trump Key Decisions: మెక్సికో, కెనడాకు బిగ్ షాక్ - ట్రంప్ సంతకాలతో అమెరికాలో ఏం మారనున్నాయంటే!
మెక్సికో, కెనడాకు బిగ్ షాక్ - ట్రంప్ సంతకాలతో అమెరికాలో ఏం మారనున్నాయంటే!
Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు !
భారీ ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు !
Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
Anantapur DRO: కీలక సమావేశంలో కూల్ కూల్‌గా రమ్మీ ఆడిన అనంతపురం డీఆర్ఓ
కీలక సమావేశంలో కూల్ కూల్‌గా రమ్మీ ఆడిన అనంతపురం డీఆర్ఓ, కలెక్టర్ చర్యలు!
Vivek Ramaswamy: డోజ్ నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి - ట్రంప్ ప్రమాణం చేసిన గంటల్లోనే కీలక నిర్ణయం
డోజ్ నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి - ట్రంప్ ప్రమాణం చేసిన గంటల్లోనే కీలక నిర్ణయం
Embed widget