అన్వేషించండి

Andhra DSC Update: గెట్ రెడీ - శుక్రవారమే ఏపీ మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ !

AP DSC merit list: 22వ తేదీన ఏపీ డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

AP DSC merit list to be released on Friday:  ఏపీ మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది.  టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వడం జరిగిందని తెలిపింది.   అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇచ్చామని..  స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన  తరుణంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది.          

మెరిట్ లిస్ట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్‌సైటుతో పాటు  జిల్లా విద్యాధికారి వెబ్‌సైటులో కూడా ఉంచుతారు.  అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ల  నుండి మాత్రమే  సమాచారం పొందాలని అధికారులు సూచించారు.  వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’ లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తారు.  సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు  జెరాక్స్ కాపీలు, 5 పాస్ పోర్టు సైజు ఫోటోలతో సర్టిఫికెట్లు వెరిఫికేషనుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది.                        

వెరిఫికేషనుకు హాజరు కావడానికి మునుపే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్లో అప్ లోడ్ చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్ డీఎస్సీ వెబ్‌సైటులో అందుబాటులో ఉంచుతారు.  సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇస్తారు.                                     

ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా, అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తూ, అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని, ఇలాంటి వదంతులు సృష్టించి వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించింది.   అభ్యర్థులు  కేవలం డీఎస్సీ అధికారిక  వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలf. అభ్యర్థుల వ్యక్తిగత  స్కోర్లు, మెరిట్ లిస్ట్, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు  మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైటు,  జిల్లా విద్యాధికారి వెబ్‌సైట్ , క్యాండిడేట్ లాగిన్ నందు ,  ప్రభుత్వం  విడుదల చేయబడే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియచేస్తారు.   

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget