Andhra University Teaching Faculty Jobs : ఆంధ్ర యూనివర్సిటీలో టీచింగ్ జాబ్స్; చివరి తేదీ జులై 13! వెంటనే అప్లై చేసుకోండి!
Andhra University Teaching Faculty: ఆంధ్రాయూనివర్శిటీలో తాత్కాలికంగా సెమిస్టర్ విధానంలో టీచింగ్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Andhra University Teaching Faculty: ఆంధ్రయూనివర్శిటీలో తాత్కాలిక విధానంలో ఉద్యోగాలను నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. వివిధ డిపార్టమెంట్‌లలో తాత్కాలికంగా విద్యాబోధన చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి మాత్రమే ఈ తాత్కాలిక నియామకాలు చేపడుతోంది.
ఆంధ్రయునివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ 2025-2026 విద్యా సంవత్సరానికి పూర్తిగా సెమిస్టర్ ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియమిస్తోంది. తగిన అర్హత కలిగిన సిబ్బందిని వివిధ విద్యా విభాగాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ నియమించాలని భావిస్తోంది. ఇలా ఎంపికైన వారికి ప్రతి సబ్జెక్టుకు గంటకు 750 రూపాయలు చెల్లిస్తారు. ల్యాబ్ వర్క్ ఉంటే గంటలకు 500 రూపాయలు చెల్లిస్తారు. గరిష్టంగా 1,10,000 రూపాయల వరకు మాత్రమే ఇస్తారు.
UGC/AICTE/PCI/BCI/NCTE/COA నిబంధనల ప్రకారం ఆసక్తిగల అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వారి వారి విద్యార్హతలు, అనుభవం దృష్టిలో ఉంచుకొని షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ ఈనెల 16 నుంచి ఉంటుంది. ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వెబ్‌సైట్‌లో పెడతారు. లేదా ఎంపికైన అభ్యర్థులకు తెలియజేస్తారు.
ఇంటర్వ్యూ కోసం వచ్చే అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు వారు పీజీ, పీహెచ్‌డీ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్‌లను తీసుకురావాలి. ఒక సెట్ జిరాక్స్ కాపీలు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. వీటితోపాటు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు కూడా జత చేయాలి. ఇంటర్వ్యూలు ఎవరికి ఎప్పుడు ఎక్కడ జరుగుతాయనే వివరాలను వివరణాత్మకంగా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
www.andhrauniversity.edu.in ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత డౌన్‌కు స్క్రోల్ చేస్తే జాబ్స్ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే తాత్కాలిక నియమకాలు అనే లింక్ కనిపిస్తుంది. దానికి చివరిలో క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుందని దానిపై క్లిక్ చేయాలి. అలా చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఇదే అందులో ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అప్లికేషన్ వస్తుంది. ఆ లింక్ ఇదే
అప్లికేషన్‌లో ముందుగా ఆధార్ కార్డు నెంబర్ ఫిల్ చేయాలి.
ఫ్యాకల్టీ కాలమ్ వద్ద మీ పేరు రాయాలి
తర్వాత తండ్రి పేరు రాయాలి
తర్వాత పుట్టిన తేదీ రాయాలి
తర్వాత మీరు ఏ డిపార్ట్మెంట్‌కు అప్లై చేస్తున్నారో నోట్ చేయాలి.
యూనివర్శిటీలో ఏ కాలేజీకి అప్లై చేస్తున్నారో చెప్పాలి.
మెయిలల్ ఐడీ ఇవ్వాలి.
మొబైల్ నెంబర్ టైప్ చేయాలి.
పాస్ వర్డ్ ఇవ్వాలి, తర్వాత ఆ పాస్‌వర్డ్‌ను మళ్లీ టైప్ చేయాలి.
అప్లికేషన్‌లో ఇచ్చిన క్యాప్చాను టైప్ చేయాలి. తర్వాత సబ్‌మిట్ పై క్లిక్ చేయాలి.
ఈ అప్లికేష్ నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఈ అప్లికేషన్ నింపిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు. ఆన్‌లైన్ దరఖాస్తులను 13 జులై 2025 రాత్రి 11:59 గంటల లోపు అప్లై చేయాలి.





















