Ashwin Slams Shreyas Iyer Omission | క్రికెటర్లు రికార్డుల కోసం స్వార్థంగా ఆడాలన్న అశ్విన్ | ABP Desam
దేశం కోసమే క్రికెట్ ఆడితే శ్రేయస్ అయ్యర్ లా అన్యాయమైపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు లెజండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఆసియా కప్ కు అయ్యర్ ను, జైశ్వాల్ ను ఎంపిక చేయకపోవటం లాంటి పరిణామాలు చూస్తుంటే ఫ్యూచర్ క్రికెటర్లు వ్యవహరించాల్సిన తీరు ఏంటో తనకు అర్థం అవుతోందన్నాడు అశ్విన్. జనరల్ గా శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ లాంటి క్రికెటర్లు రికార్డుల కోసం ఆడరు. వాళ్లంతా అయితే అటాకింగ్, లేదంటే డిఫెన్స్ టీమ్ కి ఏది అవసరం అనుకుంటే అలా ఉంటుంది. ప్రత్యేకించి శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లు ఓపెనర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకూ ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడే టైప్. ఛాంపియన్స్ ట్రోఫీ లో చూశాం మిడిల్ ఆర్డర్ లో ఆడినా టీమ్ తరపున హయ్యెస్ట్ రన్స్ నమోదు చేశాడు అయ్యర్. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవటంతో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ లో పంజాబ్ ను పదకొండేళ్ల తర్వాత ఫైనల్ కి తీసుకువెళ్లాడు. ఏకంగా 602 పరుగులు చేశాడు. అయినా కూడా అయ్యర్ ను సెలెక్ట్ చేయకపోవటం చూస్తుంటే క్రికెటర్లు ఇకపై స్వార్థంగా రికార్డుల కోసమే చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నాడు. అయ్యర్, జైశ్వాల్ లాంటి టీమ్ ప్లేయర్ల ఫర్ ఫార్మెన్స్ ను స్టాట్స్ తో కలిపి చూస్తున్నారు కాబట్టి ఏ క్రికైటరైనా తను సెంచరీలు, హాఫ్ సెంచరీలు పెంచుకోవాలి టీమ్ ఎలా పోతే తనకేంటీ అనుకుంటూ స్వార్థంగా ఆడితే మంచి నెంబర్లు ఉంటాయి ఎప్పటికీ టీమ్ లో ఉండే ఛాన్స్ ఉంటుందని తనకు అనిపిస్తోందని..ఇకపై తను ఆడేప్పుడు నెంబర్ల పైనే దృష్టి పెడతానని చెప్పాడు అశ్విన్. ఈ మాటలు చూస్తుంటే అయ్యర్ ను సెలెక్ట్ చేయకపోవటంపై బీసీసీఐ మీద అశ్విన్ ఎంత కోపంతో ఉన్నాడో అర్థం అవుతోంది





















