Virat Kohli Rohit Sharma ODI Rankings | ఐసీసీతో ఏకమై పొమ్మన లేక పొగబెడుతున్నారా | ABP Desam
ఇప్పటికే టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేసి ఫ్యూచర్ క్రికెటర్ల కోసం దారి చూపించిన కింగ్ విరాట్ కొహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మలను వన్డేల నుంచి కూడా తప్పుకోవాలని బీసీసీఐ పొగ పెడుతోందా. మొన్న ఆసియా కప్ కోసం టీమ్ సెలక్షన్ కోసం కనీసం 20-25 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. అందరూ టాప్ క్లాస్ ఆటగాళ్లే. కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, మహ్మద్ సిరాజ్, అద్భుతమైన ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లనే పక్కన పడేశారు. అలాంటిది ఇప్పుడు వన్డేలకు ఉన్న ఏకైక అడ్డంకిగా కొహ్లీ, రోహిత్ లను బీసీసీఐ భావిస్తోందా అందుకే పొమ్మనలేక పొగ బెట్టే కార్యక్రమం చేస్తోందా అని ఫ్యాన్స్ కి తెగ డౌట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్లకు చెప్తారని...ఏజ్ ఫ్యాక్టర్ చూపించి పక్కన పెడతారని వార్తలు వస్తున్న టైమ్ లో నిన్న రిలీజైన వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో అసలు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ పేర్లే లేవు. అసలు గడచిన ఐదేళ్లుగా టాప్ 10లోనే తిష్ఠ వేసుకుని కూర్చుకున్న ఇద్దరి పేర్లు సడెన్ గా కనిపించకపోయే సరికి ఇద్దరి ఫ్యాన్స్ కంగారు పడిపోయారు. పనిలో పనిగా సోషల్ మీడియాను తగలబెట్టేశారు. జనరల్ గా ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటిస్తే తప్ప అలా టాప్ 10 లో ఉన్న సడె న్ గా కనపడకపోవటం జరగదు. సో రిటైర్ అయిపోమని చెబుతున్నారా అంటూ తెగ పోస్టులు పెట్టారు. ఫ్యాన్స్ నుంచి వైల్డ్ రియాక్షన్ చూసిన దారిలోకి వచ్చింది. సారీ అది టెక్నికల్ గ్లిచ్ అంటూ రోహిత్ శర్మ వరల్డ్ 2 వన్డే ప్లేయర్..విరాట్ కొహ్లీ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాడని మరోసారి జాబితా రిలీజ్ చేసింది. టెక్నికల్ గ్లిచ్ అయితే సరిగ్గా వాళ్లిద్దరి పేర్లే ఎందుకు మాయం అయ్యాయి అనేది కింగ్, హిట్ మ్యాన్ ఫ్యాన్స్ డౌటానుమానం.





















