News
News
వీడియోలు ఆటలు
X

NTR Prashanth Neel movie : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ - మార్చిలో NTR 31 షురూ, ట్విస్ట్ ఏంటంటే?

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘NTR31‘. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేయగా, ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా షూటింగ్ అప్ డేట్ ప్రకటించారు మేకర్స్.

FOLLOW US: 
Share:

‘RRR’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకుడు పెంచారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఇప్పటికే కొరటాల శిద దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ ఈ చిత్రంపై ఓ రేంజిలో అంచనాలను పెంచేశాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.

మార్చి 2024 నుంచి  ‘NTR31’ షూటింగ్

ఇక పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘NTR31’ తెరకెక్కనుంది. యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 2024లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఎన్టీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తూ ఈ ప్రకటన చేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. గత ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన పోస్టర్ ను వదిలారు. అది ఏ రేంజ్ లో ఉందో మాటల్లో చెప్పలేం. చాలా క్రూరంగా కనిపిస్తున్నారు ఎన్టీఆర్. ఈ పోస్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. పోస్టరే ఇలా ఉందంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు ‘వార్ 2’

ఇక బాలీవుడ్ లోనూ సత్తా చాటబోతున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘వార్ 2’లో నటించనున్నారు.  ‘వార్ 2’ గురించి ఇప్పటికే యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటన చేసింది.  స్పై యూనివర్స్ చిత్రంలోకి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తుండగా, నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా షూటింగ్ ప్రారంభం ముహూర్తం సైతం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించాలని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

Also Read : నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ హిట్లు, ఎన్నో ఆటు పోట్లు - ఎన్టీఆర్ సినీ జర్నీ సాగిందిలా!

'వార్' సినిమాలో లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. చివరకు, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు.   ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. 'వార్' సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే, 'వార్ 2'కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Published at : 20 May 2023 04:05 PM (IST) Tags: Jr NTR NTR 31 Movie Prashanth Neel NTR 31 Movie shoot

సంబంధిత కథనాలు

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!