అన్వేషించండి

Harish Rao Tweet: కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు

పోలీసుల జీవితాలకే భద్రత లేకపోవడం సిగ్గుచేటు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఓ వీడియో సైతం షేర్ చేశారు.

Harish Rao Comments on Revanth Reddy | హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రిగానూ దారుణంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. రిటైర్డ్ పోలీసు ఉద్యోగి (ASI) సాధిక్ అలీ తనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం 8 నెలల నుంచి ఎదురుచూస్తున్నానని, ఇక ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ పాలన రైతులు, మహిళలు, అన్ని వర్గాలతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా శాపంగా మారిందన్నారు. విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా గడిపాల్సిన రోజుల్లోనూ రిటైర్డ్ ఉద్యోగులకు మానసిక క్షోభకు గురి చేయడం హేయమైన చర్యగా బీఆర్ఎస్ నేత అభివర్ణించారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వేల మంది ఎదురుచూపులు

దాదాపు 7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు వారికి హక్కుగా రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement Benefits) కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే గాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేని దుస్థితికి రిటైర్డ్ ఉద్యోగులను నెట్టడం దారుణం. మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించక ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీసులకు వైద్యం అందించే ఇహెచ్ఎస్ (EHS), జేహెచ్ఎస్, ఆరోగ్య భద్రత పథకాలను సేవలను సైతం అటకెక్కించే పరిస్థితి   కనిపిస్తోందని.. అత్యవసర వైద్య సేవలు అందకుండా చేశారని రేవంత్ రెడ్డి పాలనపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలన్న హరీష్ రావు
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బెన్ఫిట్స్ ని వెంటనే చెల్లించాలని, ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులకు వైద్య సేవలు కొనసాగేలా చూడాలని బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు సేవలు అందించి ఉద్యోగాలు పూర్తిచేసి, జీవితంలో విజయం సాధించిన మీ సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావు అని హరీష్ రావు సూచించారు. సమస్యలు ఉంటే పోరాడి పరిష్కారం చేసుకుందాం, బిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఫార్ములా ఈ కారు రేసు (Formula E Car Race in Hyderabad)లో విచారణ అంశం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. 

Also Read: Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు- ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget