Bichagadu 2 Collections : ఏపీ, తెలంగాణలో దుమ్ము రేపిన 'బిచ్చగాడు 2' - విజయ్ ఆంటోనీ సినిమా ఓపెనింగ్స్ ఎంతంటే?
'బిచ్చగాడు 2' మే 19న రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కలెక్ట్ చేస్తోంది. విడుదలైన తొలిరోజే రూ.4.5కోట్లు గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. ఇది డైరెక్టర్ మణిరత్నం 'పీఎస్ 2' కంటే ఎక్కువ కావడం గమనార్హం.
Bichagadu 2 : 'బిచ్చగాడు'తో రికార్డు సృష్టించి, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేసిన హీరో విజయ్ ఆంటోనీ... ఇప్పుడు 'బిచ్చగాడు 2'తో ఆ రికార్డులను కొనసాగించారు. మూవీ విడుదలైన తొలి రోజే రూ. 4.5 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన విజయ్ ఆంటోనీ.. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 'బిచ్చగాడు' సినిమాతో పాపులర్ అయిన ఆయన... ఒక్క తెలుగులోనే రూ.14 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసి 10 రెట్లు ప్రాఫిట్స్ ను అందించింది. ఈ సినిమా తర్వాత ఆయన తెలుగులో చాలా సినిమాలు వచ్చినప్పటికీ అది 'బిచ్చగాడు' మార్క్ ను రీచ్ కాలేకపోయాయి. ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'బిచ్చగాడు 2'తో మరోసారి విజయ్ ఆంటోనీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 19న రిలీజైన ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వస్తోంది. విడుదల కావడం కావడంతోనే భారీ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది.
టాలీవుడ్ లో రీసెంట్ గా సమంత 'శాకుంతలం', అఖిల్ అక్కినేని'ఏజెంట్', నాగ చైతన్య 'కస్టడీ' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినా అంతగా విజయం సాధించలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద ఇటీవల వచ్చిన సినిమాలేవీ వర్కౌట్ కాక నష్టాలను చూడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కానీ ఈ సమయంలోనే రిలీజైన 'బిచ్చగాడు 2' కు మాత్రం అనుకూల పరిస్థితులు ఏర్పడ్డట్టు తెలుస్తోంది. ఊహించని స్థాయిలో విడుదలైన తొలి రోజే రూ. 4.5కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా కోసం మేకర్స్ ఎలాంటి ప్రచారం చేయకపోయినప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు రావడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా... విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్, మేకర్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 'బిచ్చగాడు' అనే పేరునే బ్రాండ్ గా చేసుకుని విజయం సాధించారని ఇంకొందరు చెబుతున్నారు.
Also Read : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ - మార్చిలో NTR 31 షురూ, ట్విస్ట్ ఏంటంటే?
ఇక 'బిచ్చగాడు 2' సినిమా.. ఇటీవల మణిరత్నం రూపొందించిన 'పొన్నియన్ సెల్వన్ 2' కంటే భారీ ఓపెనింగ్స్ ను నమోదు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెండు తమిళ సినిమాలే అయినా, రెండూ సీక్వెల్ మూవీసే అయినా... కలెక్షన్ల విషయంలో మాత్రం చాలా తేడా వచ్చింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తీసిన సినిమానే అయినా తెలుగు ప్రేక్షకులు 'పీఎస్ 2' ను అంతగా ఆదరించలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని మరో సారి రుజువైంది. నైజాంలో మొదటి రోజే ఓ డబ్బింగ్ సినిమాకు రూ. 65 లక్షల షేర్ అంటే మామూలు విషయం కాదు కదా!