2018 movie Telugu Release: తెలుగులో లేటెస్ట్ మలయాళ బ్లాక్‌బస్టర్ '2018' - ఏపీ, తెలంగాణలోని థియేటర్లలో ఆ రోజే విడుదల
జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళం సినిమా '2018'.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కలెక్ట్ చేస్తోంది. ఇప్పుడు ఈ మూవీని నిర్మాత బన్నీ వాసు తెలుగులోకి తీసుకు రానున్నట్టు టాక్.
2018 : కంటెంట్ బాగుంటే అది భాషతో సంబంధం లేకుండా మంచి విజయం దక్కుతుందని ఇప్పటికే పలు సినిమాలు రుజువు చేశాయి కూడా. అందులో భాగంగా రీసెంట్ గా వచ్చిన 'క్రిస్టి', 'ఇరట్ట', 'రోమాంచం' వంటి మలయాళం సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఓటీటీ మాధ్యమాలు వచ్చాక.. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా.. మంచి సినిమా అని టాక్ వస్తే చాలు చూసేందుకు ఏ మాత్రం సందేహించడం లేదు. అది థియేటరా, ఓటీటీనా అని చూడటం లేదు. కేవలం మౌత్ టాక్ పాజిటివ్‌గా వస్తే చాలు.. బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షం కురుస్తోంది. ఇప్పుడు అదే నమ్మకంతో నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) ఇటీవలే మలయాళంలో రిలీజైన '2018' సినిమాను తెలుగులోకి తీసుకురానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళం సినిమా '2018'.. మే5 రిలీజైంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ ఆ తర్వాత కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేసిన మూవీల జాబితాలోకి చేరిపోయింది. అనూహ్యంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించకపోయినప్పటికీ ఆ స్థాయిలోనే రెస్పాండ్ వస్తోంది. అలా విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ.100కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
స్టోరీ ఏంటంటే..
ఇక మలయాళంలో సంచలనం సృష్టిస్తోన్న ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో నిర్మాత బన్నీ వాసు అడుగు ముందుకేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు హక్కులను ఆయన సొంతం చేసుకున్నారని టాక్ నడుస్తోంది. అంతే కాదు '2018' మూవీని నైజాం ఏరియాలో బన్నీ వాసునే సొంతంగా విడుదల చేస్తునట్టుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా మే 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : యుద్ధభూమిలో కలుద్దాం మిత్రమా - ఎన్టీఆర్‌తో 'వార్ 2', హింట్ ఇచ్చేసిన హృతిక్!
బీభత్సమైన కలక్షన్స్ ను రాబడుతోన్న '2018' స్టోరీ విషయానికొస్తే.. కేరళలో '2018' లో అధిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో సుమారుగా 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కేరళ చరిత్రలోనే సుమారు ఓ శతాబ్దంలో జరిగిన అతి పెద్ద వరదలు ఇవేనని చెప్పొచ్చు. దీన్ని ఆధారంగా చేసుకుని "జూడ్ ఆంథనీ జోసెఫ్" 2018 ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కేరళలోని ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. దొంగ మెడికల్ సర్టిఫికెట్ తో ఆర్మీలో చేరి.. అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా "టోవినో థామస్" అనూప్ పాత్రలో కనిపిస్తాడు. కున్చాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Read Also : Kangana Ranaut: అలా మాట్లాడినందుకు రూ.40 కోట్లు కోల్పోయా: కంగనా రనౌత్