News
News
వీడియోలు ఆటలు
X

Kangana Ranaut: అలా మాట్లాడినందుకు రూ.40 కోట్లు కోల్పోయా: కంగనా రనౌత్

సమకాలీన అంశాలపై తన వాయిస్ ను వినిపించే హీరోయిన్ కంగనా రనౌత్... యాంటి నేషనల్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల 25 బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు చేజారిపోయానని, ఏడాదికి రూ.40 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.

FOLLOW US: 
Share:

Kangana Ranaut: పలు విషయాలను ఎత్తి చూపుతూ.. ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఎప్పుడూ ఏదో ఒక వార్తతో వైరల్ అవుతూనే ఉంటారు. తాను రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వల్ల ఏటా రూ.30 కోట్లు నుంచి 40 కోట్లు నష్టపోతున్నానని వెల్లడించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూను షేర్ చేసిన కంగనా రనౌత్.. తాను అనుకున్నది చెప్తానని, దానికి పర్యావసానంగా డబ్బు కోల్పోతే.. అలానే ఉండండి అనే క్యాప్షన్ ను కూడా రాసుకొచ్చింది.

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్.. తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా, ఎంతమంది ట్రోల్ చేసినా ఒకే మాటపై నిలబడుతూ తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటుంది. అలా ఎన్ని కాంట్రవర్సీల్లో చిక్కుకున్నా ఏ మాత్రం తడబడకుండా చాలాసార్లు తన ధైర్యాన్ని చాటుకుని స్ఫూర్తిగానూ నిలిచింది. మరోసారి అది నిరూపితమైంది. తాజాగా ఆమె.. మస్క్‌ చెప్పినట్టుగా ఉండటం వల్ల ఎంత నష్టపోయానో చెప్పుకొచ్చింది. ఇది ఒక పాత్ర. నిజమైన స్వాతంత్ర్యం, విజయం, హిందూ మతం కోసం మాట్లాడటం, రాజకీయ నాయకులు, జాతీయ వ్యతిరేకులు, తుక్డే గ్యాంగ్.. నన్ను 20-25 బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌ కోల్పోయేలా చేశాయి. వాళ్లు నన్ను రాత్రికి రాత్రే పక్కన పెట్టేయడం వల్ల సంవత్సరానికి రూ. 30-40 కోట్ల నష్టం జరిగింది. కానీ నేను స్వేచ్ఛగా ఉన్నా అంటూ కంగనా తెలిపింది.

ఇప్పుడు భారతదేశ సంస్కృతి, సమగ్రతను ద్వేషించే ఎజెండాతో నడిచే మల్టి నేషనల్ కంపెనీలు, వారి కార్పొరేట్ బ్రాండ్ హెడ్‌ల మాట వినట్లేదు కాబట్టి తాను స్వేచ్ఛగా ఉన్నానని కంగనా తెలిపింది. నిజానికి ప్రతి ఒక్కరూ బలహీనతలను మాత్రమే ప్రదర్శిస్తారు. అందుకే నేను ఎలన్‌ను అభినందిస్తున్నాను. కనీసం ధనవంతులైనా డబ్బు గురించి పట్టించుకోకూడదని పేర్కొంది. ఈ సందర్భంగా మస్క్ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను కూడా ఆమె జత చేసింది.

చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న సమస్యలపైనా కంగనా రనౌత్ తన వాయిస్ ను వినిపించింది. ఇటీవలి కాలంలో మల్టీప్లెక్స్‌లు నష్టాలను చవిచూస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. థియేటర్ సందర్శనలు చాలా ఖరీదైనవిగా మారడంపై స్పందించిన ఆమె.. దేశంలో మరిన్ని థియేటర్ల అవసరం ఉందని చెప్పుకొచ్చింది.

మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ లో రెగ్యులర్ గా మస్క్ ను ప్రశంసించే కంగనా.. గతలోనూ ఒక ట్విట్టర్ యూజర్ ఇండియన్ డిషెస్‌తో విందు చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోకు రిప్లైగా స్పందించిన మస్క్ కామెంట్ కూ ఆమె ఎమోజీని జత చేసింది.

ఇక కంగన సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆమె పి. వాసు దర్శకత్వంతో ‘చంద్రముఖి 2’ చిత్రంలో కనిపించనుంది. మరొకొద్ది రోజుల్లో కంగనాను ప్రేక్షకులు ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిద్దా’, ‘ది అవతార్: సీత’లో కూడా చూడనున్నారు. ‘తేజస్’ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటిస్తోన్న కంగనా..  తన లిస్టులో పీరియాడికల్ డ్రామా మూవీ ‘ఎమర్జెన్సీ’ కూడా ఉంది. ఇది ఆమె ‘సోలో’గా దర్శకత్వం వహించిన చిత్రం కావడం విశేషం. 

Read Also : 'టైగర్ 3' సెట్‌లో గాయపడ్డ సల్మాన్ ఖాన్

Published at : 19 May 2023 07:45 PM (IST) Tags: Kangana Ranaut Elon Musk Talk of the Industry Brand Endorsements Thukde Gang

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?