News
News
వీడియోలు ఆటలు
X

'టైగర్ 3' సెట్‌లో గాయపడ్డ సల్మాన్ ఖాన్

కండలవీరుడు సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ మూవీ సెట్లో గాయపడ్డాడు. గాయానికి సంబంధించిన ఫొటోను షేర్ చేసి, టైగర్ జమ్కీ హై అనే క్యాప్షన్ ను కూడా ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

FOLLOW US: 
Share:

Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గాయపడ్డాడు. మనీష్ శర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'టైగర్ 3' మూవీ సెట్లో తాను గాయపడినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం 'టైగర్ 3' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' తర్వాత సూపర్ హిట్ టైగర్ ఫ్రాంచైజీలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సందర్భంగా నటుడు సల్మాన్ తన బేర్ బ్యాక్ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టులో అతని భుజం వెనుక భాగంలో భారీ కట్టు ఉంది. ఈ ఫొటోతో పాటు “ప్రపంచపు బరువును మీ భుజాలపై మోస్తున్నారని అనుకుంటున్నట్టయితే.. ప్రపంచాన్ని పక్కన పెట్టి 5 కిలోల డంబెల్ ను ఎత్తి చూపించండి అని రాసుకొచ్చాడు. దాంతో పాటు 'టైగర్ జఖ్మీ హై' అంటే పులి గాయపడింది అంటూ ‘టైగర్ 3’ హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు. 

తాజాగా సల్మాన్ ఖాన్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. దయచేసి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని కోరుతున్నారు. 

ఇక 'టైగర్ 3' ఈ దీపావళికి థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో సల్మాన్ తో పాటు అలనాటి అందాల తార రేవతి మరోసారి కలిసి నటించబోతోంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'టైగర్‌ 3' చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ను కమాండ్ చేసే రా ఆఫీసర్‌ పాత్రలో రేవతి కనిపించనుందని ఇన్‌సైడ్‌ టాక్‌. టైగర్‌ ప్రాంఛైజీలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం షారుఖ్ తన జుట్టును పొడవుగా పెంచుతున్నాడని, త్వరలో సల్మాన్‌తో తన సన్నివేశాన్ని షూట్ చేయనున్నాడని సమాచారం. 'టైగర్ 3' కి ముందు, సల్మాన్, SRK కలసి సిద్ధార్థ్ ఆనంద్ బ్లాక్ బస్టర్ పఠాన్‌లో కలిసి కనిపించారు. సల్మాన్ ఖాన్‌తో పాటు, టైగర్ 3లో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఇమ్రాన్ విలన్ గా కనిపించనున్నారు. కత్రినా కైఫ్ కూడా ఈ సినిమాలో భాగం కానుంది. ఈ సినిమాలో వీరందరితో పాటు అశుతోష్‌ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్‌ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

సల్మాన్ ఖాన్ ఇటీవలే 'ద-బాంగ్' రీలోడెడ్ టూర్‌లో భాగంగా కోల్‌కతాలో ప్రదర్శన ఇచ్చాడు. సోనాక్షి సిన్హా, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఆయుష్ శర్మ, మనీష్ పాల్, గురు రంధవాతో సహా అనేక మంది స్టార్స్ ఈ టూర్ లో భాగమయ్యారు. కోల్‌కతా అందించిన ప్రేమకు చాలా ధన్యవాదాలని సల్మాన్ ఈ సందర్భంగా చెప్పాడు.  అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా ఆయన కలిశాడు.

Read Also : నడవలేని స్థితిలో ‘జబర్దస్త్’ రోహిణి - 10 గంటలు సర్జరీ, కానీ..

Published at : 19 May 2023 01:45 PM (IST) Tags: Tiger 3 Injured Salman Khan Shooting Spot Imran Ishmi Tiger Zamki Hai

సంబంధిత కథనాలు

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?