News
News
వీడియోలు ఆటలు
X

నడవలేని స్థితిలో ‘జబర్దస్త్’ రోహిణి - 10 గంటలు సర్జరీ, కానీ..

'జబర్థస్త్' ద్వారా పాపులారిటీ తెచ్చుకున్నఆర్టిస్ట్ రోహిణి ఎట్టకేలకు తన కాలులో కూరుకుపోయిన రాడ్డును తీసివేయించుకున్నారు. దాదాపు 10గంటలు శ్రమించి డాక్టర్లు ఆ రాడ్డును కష్టపడి తొలగించారని వెల్లడించారు.

FOLLOW US: 
Share:

Rohini: బుల్లితెరపై పలు షోస్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న లేడీ ఆర్టిస్ట్ రౌడీ రోహిణి.. ఇటీవలే తన కాలులో ఉన్న రాడ్ ను తీయించుకునేందుకు హాస్పిటల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. 2016లో ఆమెకు యాక్సిడెంట్ అయిందని, ఇంతకాలం కెరీర్ లో బిజీగా ఉండడంతో రాడ్డును తీయించేందుకు టైం దొరకలేదని ఇటీవలే ఆమె యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించింది. అయితే ప్రమాదం జరిగి దాదాపు ఆరున్నర సంవత్సరాలు కావడంతో రాడ్డు కాలు ఎముకలోకి చొచ్చుకుపోయిందని, తీయటం కష్టమని కూడా వైద్యులు చెప్పినట్టు రోహిణి వీడియోలో వెల్లడించింది. తాజాగా ఆ రాడ్డును డాక్టర్లు తీసివేసినట్టు ఆమె మరో వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

హైదరాబాద్ లోని హాస్పిటల్ లో రాడ్డు తీయడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో రోహిణి తన తల్లిదండ్రులతో కలిసి విజయవాడలోని ఓ ఆస్పత్రికి వెళ్లినట్టు ఆమె తెలిపింది. అప్పట్లో యాక్సిడెంట్ అయిన సమయంలో తాను అక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్నానని, తన పరిస్థితి చెప్పడంతో తనకు చికిత్స చేసిన శ్రీధర్ అనే డాక్టర్ చెప్పినట్టు ఆమె చెప్పింది. దాంతో పాటు ఆమె కాలులో రాడ్డును తొలగించిన విధానాన్ని కూడా రోహిణి వివరించింది.

తనకు గంటలో సర్జరీ చేస్తామని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారని రోహిణి చెప్పింది. కానీ ఆ రాడ్డు బయటికి తీయడానికి 10 గంటలు పట్టిందని తెలిపింది. రాడ్డు సగానికి వచ్చి మధ్యలో ఆగిపోయిందని, కానీ డాక్టర్లు ఎలాగోలా కష్టపడి దాన్ని బయటకు తీశారని చెప్పింది. ఆరు వారాల దాకా కాలు కింద పెట్టకూడదని, కాలుపై ఎలాంటి బరువులు వేయకూడదని డాక్టర్లు సూచించినట్టు రోహిణి వీడియోలో చెప్పుకొచ్చింది. చాలా కుట్లు వేశారన్న ఆమె.. కాలుకు డ్రెస్సింగ్ చేసే సన్నివేశాలను, కుట్లు పడిన ప్రాంతాలను కూడా వీడియోలో చూపించింది. అంతే కాకుండా ఆమె చేతికి ఎక్కడ పడితే అక్కడ ఇంజక్షన్ల కోసం సూదులు గుచ్చారని ఏడుస్తూ తెలిపింది. ఈ సమయంలో ఆమె పక్కనే ఉండి, అన్నీ చూసుకుంటున్న రోహిణి తల్లి కూడా ఆమెకు ధైర్యం చెప్తూ మాట్లాడింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ మునుపటిలా తన తోటి నటులతో కలిసి షోస్ లో పాల్గొనవచ్చని చెప్పింది.

రోహిణి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ వీడియోపై ఆమె అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉండే ఆమె.. ఇలా బెడ్ పై ఉండడం చూసి ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

అంతకు ముందు ఇదే విషయంపై యూట్యూబ్ లో వీడియో అప్ లోడ్ చేసిన రోహిణి.. ఈ సమయంలో కాలులో రాడ్డు తీయించుకుందామని అనవసరంగా వచ్చానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రాడ్డును తీయలేమని డాక్టర్లు చెబుతున్నారని, ఒకవేళ తీస్తే ఎముక మల్టిఫుల్ ఫ్యాక్చర్స్ అయ్యే ప్రమాదముందని హెచ్చరించినట్టు వెల్లడించింది.

Read Also : తన బాడీగార్డ్స్ చేసిన పనికి షాకైన రష్మిక - ఫ్యాన్స్ మనసు దోచుకున్న నేషనల్ క్రష్!

Published at : 17 May 2023 05:48 PM (IST) Tags: Accident Hospital Jabardasth Rohini Rowdy Rohini Leg Facture Rod

సంబంధిత కథనాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!