News
News
వీడియోలు ఆటలు
X

తన బాడీగార్డ్స్ చేసిన పనికి షాకైన రష్మిక - ఫ్యాన్స్ మనసు దోచుకున్న నేషనల్ క్రష్!

రష్మిక మందన్నతో సెల్ఫీ దిగడానికి వచ్చిన ఓ అభిమానిని ఆమె బాడీ గార్డ్స్ దూరంగా నెట్టేశారు. అది చూసిన రష్మిక వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత అతను బాగానే ఉన్నాడని తెలుసుకుని వెళ్లిపోయింది.

FOLLOW US: 
Share:

Rashmika Mandanna : 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక  మందన్న ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే ఆమెకున్న పాపులారిటీ కారణంగా ఆమెతో ఫొటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అందులో ఓ యువకుడు రష్మికతో సెల్ఫీ దిగడానికి రాగా, అతన్ని ఆమె బాడీగార్డులు దూరంగా తోసేశారు. దీంతో షాకైన రష్మిక.. బాడీగార్డులను ఆపడానికి ప్రయత్నించింది. అంతే కాకుండా ఆమె ముందుకు నడుస్తూ కూడా అతను బాగున్నాడా అని పరిశీలించింది. ఆ తర్వాత ఆమె వెనకే సెల్ఫీ కోసం వచ్చిన ఆ బాలికతో ఫొటో ఫోజిచ్చి అందర్నీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రష్మిక.. తెలుపు రంగు సంప్రదాయ కుర్తీని ధరించి, మినిమల్ మేకప్ లో అందంగా కనిపించింది.

ప్రస్తుతం రష్మిక తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది. రణబీర్ కపూర్ సరసన 'యానిమల్' చిత్రంలో నటిస్తోంది. 'కబీర్ సింగ్', 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ న్యూఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీంతో పాటు 'పుష్ప 2' కోసం రష్మిక, అల్లు అర్జున్‌తో మళ్లీ కలిసి నటించనుంది. తెలుగులో 'రెయిన్‌బో' చిత్రంలోనూ కనిపించనుందియ దేవ్ మోహన్‌తో కలిసి నటించిన రష్మిక గత నెలలో మున్నార్, కొడైకెనాల్‌లో సినిమా షూటింగ్‌ని పూర్తి చేసింది.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

రష్మిక నెక్స్ట్  చిత్రం జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడితో నటించనుందది. ప్రాజెక్ట్ 'ఛవా' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడుతుంది. 'ఛవా' అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు గురించి రూపొందుతున్న పాన్-ఇండియన్ చారిత్రాత్మక చిత్రం. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో విక్కీ కౌశల్ కి జోడిగా రష్మిక నటిస్తుంది. ఆమె శంభాజీ మహరాజ్ భార్య యేసుబాయి భోంసాలే పాత్రను పోషించనుంది.

ఇదిలా ఉండగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన 'బేబీ' సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రష్మిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయి రాజేష్  దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ కె ఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఫంక్షన్ లో రష్మిక సాంగ్ రిలీజ్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ, రష్మికను ఏమని పిలుస్తాడో కూడా ఈ వేదికపై వెల్లడించాడు. తనకు రష్మిక ఎప్పట్నుంచో పరిచయం కాబట్టి ఆమె తాను రషి అని పిలుస్తానని ఆయన చెప్పారు. అంతే కాకుండా ప్రేమ పాటలకు రష్మిక ఓ పోస్టర్ లా మారిపోయిందని ఆనంద్ కొనియాడాడు. ఇక స్టేజీపై ఉన్నంత సేపు నవ్వుతూనే ఉన్న రష్మిక.. అన్న ఎక్కడ అని ఆనంద్ ను అభిమానులు అడిగిన ప్రశ్నకు.. అన్న రాజమండ్రిలో ఉన్నాడని సమాధానమిచ్చాడు.

Read Also : ఓటీటీలోకి ‘అవతార్ 2’ - ఇక రెంట్ కాదు, ఫ్రీ స్ట్రీమింగ్!

Published at : 17 May 2023 04:01 PM (IST) Tags: Rashmika Mandanna Pushpa fans anand devarakonda Bodyguard Selfi

సంబంధిత కథనాలు

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

MP Arvnid: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నరు: ఎంపీ అర్వింద్

MP Arvnid: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నరు: ఎంపీ అర్వింద్