‘ఆర్‌సీ17’ అనౌన్స్‌మెంట్, ‘ఫ్యామిలీస్టార్’ కొత్త పాట - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'రంగస్థలం' కాంబో ఈజ్ బ్యాక్ - ఈసారి పాన్ వరల్డ్ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకునేలా
'రంగస్థలం'... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో స్పెషల్ ఫిల్మ్. హీరోగా ఆ సినిమాకు ముందు ఆయనకు బోలెడు విజయాలు ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'మగధీర' సైతం ఉంది. అయితే... అంతకు ముందు సినిమాల్లో కనిపించిన చరణ్ వేరు, 'రంగస్థలం'లో కనిపించిన చరణ్ వేరు. నటుడిగా ఆయన స్థాయిని, స్థానాన్ని పెంచిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఆ 'రంగస్థలం' కాంబోలో మరో సినిమా రెడీ అవుతోంది. ఇవాళ ఆ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ కథానాయకుడు, 'సలార్' సినిమాలో వరదరాజ మన్నార్ పాత్రతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటించిన తాజా సినిమా 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం). ఈ గురువారం (మార్చి 28న) థియేటర్లలో విడుదల కానుంది. అయితే... టాలీవుడ్ డైరెక్టర్లకు ఆదివారం రాత్రి హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో ప్రత్యేకంగా షో వేశారు. మరి, వాళ్ళు సినిమాకు ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసుకోండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మధురము కదా... విజయ్ దేవరకొండ, మృణాల్ జోడీ & శ్రేయా ఘోషల్ వాయిస్ - సాంగ్ ఎలా ఉందో విన్నారా?
మధురము కదా... గోపీసుందర్ ట్యూన్ కట్టిన తర్వాత సాంగ్ రాసిన లిరిసిస్ట్ శ్రీమణి (Lyricist Srimani) ఆ రెండు వర్డ్స్ కాయినింగ్ చేశారో? లేదంటే ఆయన పాట రాసిన తర్వాత దర్శకుడు పరశురామ్ పెట్ల 'మధురము కదా' అని అన్నారో? లేదంటే సాంగ్ అండ్ విజువల్స్ చూసి ప్రొడ్యూసర్లు 'దిల్' రాజు, శిరీష్ 'మధురము కదా' అన్నారో? ఏది ఏమైనా సరే... 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మూడో పాట మధురమే! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మూడో రోజు అదరగొట్టిన బ్యాంగ్ బ్రోస్ - 'ఓం భీమ్ బుష్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఎంతంటే?
బాక్సాఫీస్ బరిలో బ్యాంగ్ బ్రోస్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రోజు రోజుకూ 'ఓం భీమ్ బుష్' థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకుల్ని రప్పిస్తూ... భారీ వసూళ్లు సాధించే దిశగా దూసుకు వెళుతున్నారు. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ బావున్నాయి. మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది? ఈ సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? ఇప్పటి వరకు 'ఓం భీమ్ బుష్' 17 ప్లస్ కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రీమియర్ షో నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'సింబా'లో రణవీర్ టీచర్... కలియుగ పట్టణంలో పోలీస్... సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్!
సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో పాటు తమ సినిమాలో మదర్ సెంటిమెంట్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'కలియుగం పట్టణంలో'. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. మార్చి 29న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మీడియాతో ముచ్చటించారు. పోలీస్ పాత్రలో మరో హీరోయిన్ చిత్రా శుక్లా కనిపిస్తారని తెలిపారు. 'సిల్లీ ఫెలోస్'లో ఆమె పోలీస్ రోల్ చేశారు. బాలీవుడ్ హిట్ 'సింబా'లో హీరో రణవీర్ సింగ్ టీచర్ రోల్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)