అన్వేషించండి

Kaliyugam Pattanamlo Movie: 'సింబా'లో రణవీర్ టీచర్... కలియుగ పట్టణంలో పోలీస్... సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్!

Director Ramakhanth Reddy Interview: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'కలియుగం పట్టణంలో' మార్చి 29న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ...

సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో పాటు తమ సినిమాలో మదర్ సెంటిమెంట్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'కలియుగం పట్టణంలో'. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. మార్చి 29న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మీడియాతో ముచ్చటించారు. 

'కలియుగం పట్టణంలో' టైటిల్ గురించి దర్శకుడు మాట్లాడుతూ... ''కలియుగం అనేది ఊరి పేరు మాత్రమే కాదు... ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారు? ఏంటి? అనే కథ. ఓ పట్టణం నేపథ్యంగా తీసుకుని అక్కడ మనుషుల గురించి చూపించా. టైటిల్‌ డిజైన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆ మస్కిటో కాయిల్స్, రెంచ్ ఏంటి? అని! కథతో వాటికిలింక్ ఉంది. అందుకే పెట్టాను. కథలో అడవికి, ఔషధ మొక్కలకు కూడా లింక్ ఉంది. నంద్యాల దగ్గరలో అడవి ఉంది. అందుకని, ఆ నేపథ్యం తీసుకున్నా'' అని చెప్పారు. 

మెంటల్ హాస్పిటల్ నుంచి కథ మొదలు
సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో మదర్ సెంటిమెంట్, చక్కటి ప్రేమ కథ, యాక్షన్, యువతకు మంచి సందేశం ఉన్నాయని రమాకాంత్ రెడ్డి చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''హీరో మెంటల్ ఆస్పత్రిలో ఉన్నప్పట్నుంచి కథ మొదలు అవుతుంది. ఎందుకు? అనేది స్క్రీన్ మీద చూడాలి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కూడా చూపించాం. సమాజంలో చాలా మంది తండ్రులు 'మా అబ్బాయి ఇలా ఉండాలి, ఇలా చేయాలి' అంటూ సోషియో ఫోబియాతో ఉన్నారు. అబ్బాయి ఏం చేస్తే సమాజం ఏం అంటుందోనని ఆలోచిస్తారు. పిల్లల ఫీలింగ్స్ పట్టించుకోరు. దాన్ని కూడా ప్రస్తావించా'' అని చెప్పారు.  

బెంగళూరు బస్సులో కథకు పునాది
'కలియుగం పట్టణంలో' కథకు పునాది ఎక్కడ పడిందనేది రమాకాంత్ రెడ్డి చెబుతూ... ''నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక రోజు బెంగుళూరు నుంచి మా ఊరికి బస్సులో వస్తున్నా. నా పక్క సీటులో ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు. ఆవిడ సైకాలజీ బుక్ చదువుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇటువంటి పుస్తకాలు చదవకూడదని చెప్పా. 'మేం ఏం చేయాలో మాకు తెలుసు' అని పొగరుగా సమాధానం చెప్పింది. దాంతో నేను మాట్లాడలేదు. అప్పుడు ఈ కథ గురించి ఆలోచన వచ్చింది'' అని చెప్పారు. 

తాను డిగ్రీలో ఉన్నప్పుడు కర్నూల్ దగ్గర 'అరుంధతి' చిత్రీకరణ జరగ్గా కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేశానని, అప్పట్నుంచి సినిమాలపై ఆసక్తి పెరిగిందని రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఇంకా తన నేపథ్యం గురించి ఆయన చెబుతూ ''విశాఖలో చదువుకున్నా. అప్పుడే సినిమాల్లో తిరిగా. తర్వాత బెంగళూరులో ఉద్యోగం చేశా. మళ్లీ హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించా. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా చేసిన అనుభవం ఉంది. కరోనా సమయంలో పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా'' అని చెప్పారు. 

విశ్వ కార్తికేయ ధైర్యంగా ముందుకు వచ్చాడు
ఈ సినిమాలో హీరోగా ఇంతకు ముందు ఒకట్రెండు సినిమాలు చేసిన కొందర్ని అప్రోచ్ అయితే... క్యారెక్టర్ ఇంటెన్స్ చూసి చేయలేమని చెప్పారని రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''కొందరు చేయలేమని తప్పుకొంటే విశ్వ కార్తికేయ ప్రొఫైల్ నా దగ్గరకు వచ్చింది. కథ విని ధైర్యంగా చేస్తానని చెప్పాడు. అతనిలో కాన్ఫిడెన్స్ నచ్చింది. దాంతో సెలెక్ట్ చేశాం. ఇంతకు ముందు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. హీరోయిన్ ఆయుషీ పటేల్ తెలుగమ్మాయి. సినిమాలకు కొత్త. గ్లామర్ గాళ్ అని కాకుండా కీలక పాత్రలో కనిపిస్తుంది'' అని చెప్పారు.

Also Read: 'సాహో' హీరోయిన్ దొరికేసిందా? లేదంటే కావాలని అలా చేసిందా?

పోలీస్ పాత్రలో మరో హీరోయిన్ చిత్రా శుక్లా కనిపిస్తారని తెలిపారు. 'సిల్లీ ఫెలోస్'లో ఆమె పోలీస్ రోల్ చేశారు. బాలీవుడ్ హిట్ 'సింబా'లో హీరో రణవీర్ సింగ్ టీచర్ రోల్ చేశారు. ఇప్పుడు ఇందులో ఆమె పోలీస్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి. పలువురు ఇండస్ట్రీ పెద్దలు సినిమా చూసి బావుందని మెచ్చుకోవడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని రమాకాంత్ రెడ్డి చెప్పారు.   

అన్నపూర్ణ సంస్థ ద్వారా విడుదల!
థ్రిల్లర్ సినిమాల నేపథ్య సంగీతం ముఖ్యమని, అజయ్ అరసాడ కొత్త సంగీత దర్శకుడు అయినప్పటికీ మంచి మ్యూజిక్ ఇచ్చారని దర్శకుడు రమాకాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ''అజయ్ అరసాడ అడివి శేష్ 'గూడాచారి'కి కీ బోర్డు ప్లేయర్. 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్... మూడు సినిమాలకు వర్క్ చేశాడు. మా సినిమాకు మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడు'' అని చెప్పారు. 

దర్శకుడిగా తన తొలి సినిమాను ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు రమాకాంత్ రెడ్డి. రిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ... ''మేము అన్నపూర్ణ సంస్థ వాళ్లను అప్రోచ్ అయ్యాం. తమకు కథ నచ్చిందని, చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తామని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్లకు థాంక్స్'' అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన మహేష్ తన కజిన్ అని, కథ నచ్చడంతో ఓబుల్ రెడ్డి, రమేష్ యాడ్ అయ్యారని చెప్పారు. ఈ సినిమాకు సీక్వెల్ 'కలియుగం నగరంలో' తీస్తున్నామని రమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Readపసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget