అన్వేషించండి

‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘చారి 111’ రివ్యూలు, ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ: వరుణ్ తేజ్ దేశభక్తి సినిమా హిట్టా? ఫట్టా?
జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి, కొత్తదనంతో కూడిన సినిమాలు అందించడానికి ప్రయత్నించే యువ హీరో వరుణ్ తేజ్. ఇప్పటి వరకు టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద ఎవరు టచ్ చేయనటువంటి ఏరియల్ కాంబాట్ జానర్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' చేశారు. పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ప్రతీకార దాడి నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. ఎలా ఉందో రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అప్పుడు నాకు 19 ఏళ్లే, ఛాన్స్ ఇస్తానంటూ కమిట్మెంట్ అడిగాడు - సౌత్ ప్రొడ్యూసర్‌పై ‘బిగ్ బాస్’ బ్యూటీ ఆరోపణలు
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ అని కొందరు హీరోయిన్లు వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే తమకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కొందరు నటీమణులు ఓపెన్‌గా స్టేట్‌మెంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ కూడా ఒక నిర్మాత తనను కమిట్‌మెంట్ అడిగారని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తనెవరో బిగ్ బాస్ 17 ఫేమ్ అంకితా లోఖండే. తన భర్త విక్కీ జైన్‌తో కలిసి తాజాగా హిందీలో పూర్తయిన బిగ్ బాస్ సీజన్ 17లో కంటెస్టెంట్‌గా వచ్చింది అంకితా. ఇక ఈ రియాలిటీ షో పూర్తయిన తర్వాత తన పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది. తాజాగా తను సినీ పరిశ్రమలో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి బయటపెట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘హనుమాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?
2024 సంక్రాంతికి విడుదలయిన అన్ని సినిమాల్లో ‘హనుమాన్’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికీ పలు ప్రాంతాల్లోని థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పటికీ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి కొందరు ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. కానీ థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు మాత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ‘హనుమాన్’ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వినిపించనుంది మూవీ టీమ్. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

చారి 111 రివ్యూ: 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
హాస్య నటుడిగా 'వెన్నెల' కిశోర్ నవ్వించిన సినిమాలు కోకొల్లలు. ఆయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన హీరోగా నటించారంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. మరి, 'చారి 111' ఎలా ఉంది? 'మళ్ళీ మొదలైంది' ఫేమ్ టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం ఎలా ఉంది? మురళీ శర్మ, హీరోయిన్ సంయుక్తా విశ్వనాథన్ ఎలా నటించారు? అనేది రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘యానిమల్ పార్క్’లో విలన్‌గా ఆ బాలీవుడ్ యంగ్ హీరో - బాబీ డియోల్‌ను మరిపిస్తాడా?
‘యానిమల్ పార్క్’లో రణబీర్ కపూర్‌ను ఎదిరించే ధీటైన విలన్ పాత్రలో యంగ్ హీరో విక్కీ కౌశల్ కనిపించనున్నట్టు సమాచారం. ఇప్పటికే రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కాంబినేషన్‌లో ‘సంజు’ అనే సినిమా వచ్చింది. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలతో అలరించిన విక్కీ కౌశల్‌కు.. ‘సంజు’ బిగ్ బ్రేక్ ఇచ్చింది. కానీ ఈ విషయం బాబీ డియోల్ ఫ్యాన్స్‌ను కాస్త డిసప్పాయింట్ చేస్తోంది. ‘యానిమల్’లో చనిపోయింది బాబీ డియోల్ కాదని, అతడి బాడీ డబుల్ అని, ‘యానిమల్ పార్క్’లో మళ్లీ తన పాత్ర తిరిగి వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆ స్థానంలోకి విక్కీ కౌశల్ వస్తున్నాడని తెలిసి ఫీల్ అవుతున్నారు. మరికొందరు మాత్రం విలన్‌గా విక్కీ కౌశల్ పూర్తిగా న్యాయం చేస్తాడని నమ్ముతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget