అన్వేషించండి

Animal Park: ‘యానిమల్ పార్క్’లో విలన్‌గా ఆ బాలీవుడ్ యంగ్ హీరో - బాబీ డియోల్‌ను మరిపిస్తాడా?

Animal Park: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘యానిమల్ పార్క్’లో బాబీ డియోల్ ఉండడని కొంతవరకు కన్ఫర్మ్ అయ్యింది. కానీ అదే స్థానంలో విలన్ పాత్ర చేయడానికి ఒక యంగ్ హీరో సిద్ధమయ్యాడని సమాచారం.

Animal Park: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ ఒక రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే దీని సీక్వెల్ గురించి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘యానిమల్’కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన ఎన్నో రూమర్స్ బాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో విలన్‌గా నటించిన బాబీ డియోల్ పాత్ర ముగిసిపోతుంది. అంతే కాకుండా ‘యానిమల్’ ఎండ్ క్రెడిట్స్ సమయంలో సీక్వెల్‌లో రణబీర్ కపూరే విలన్‌గా కనిపించనున్నట్టు రివీల్ చేశారు. అయితే ఇందులో మరో విలన్‌గా కూడా ఉండవచ్చని తాజాగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

ఇన్నేళ్ల తర్వాత..

‘యానిమల్ పార్క్’లో రణబీర్ కపూర్‌ను ఎదిరించే ధీటైన విలన్ పాత్రలో యంగ్ హీరో విక్కీ కౌశల్ కనిపించనున్నట్టు సమాచారం. ఇప్పటికే రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కాంబినేషన్‌లో ‘సంజు’ అనే సినిమా వచ్చింది. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలతో అలరించిన విక్కీ కౌశల్‌కు.. ‘సంజు’ బిగ్ బ్రేక్ ఇచ్చింది. కానీ ఈ విషయం బాబీ డియోల్ ఫ్యాన్స్‌ను కాస్త డిసప్పాయింట్ చేస్తోంది. ‘యానిమల్’లో చనిపోయింది బాబీ డియోల్ కాదని, అతడి బాడీ డబుల్ అని, ‘యానిమల్ పార్క్’లో మళ్లీ తన పాత్ర తిరిగి వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆ స్థానంలోకి విక్కీ కౌశల్ వస్తున్నాడని తెలిసి ఫీల్ అవుతున్నారు. మరికొందరు మాత్రం విలన్‌గా విక్కీ కౌశల్ పూర్తిగా న్యాయం చేస్తాడని నమ్ముతున్నారు.

రెండు సినిమాల్లో..

‘సంజు’లో కలిసి కనిపించిన ఎన్నో ఏళ్ల తర్వాత ‘యానిమల్ పార్క్’లో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కలిసి కనిపించనున్నారు అనే విషయం బాలీవుడ్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచేస్తోంది. ఇది మాత్రమే కాకుండా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ అండ్ వార్’ అనే చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్‌గా కనిపించనుంది. ‘యానిమల్ పార్క్’లో విక్కీ కౌశల్ విలన్‌గా నటిస్తుండగా.. ‘లవ్ అండ్ వార్’లో మాత్రం విక్కీది పాజిటివ్ రోల్ అని తెలుస్తోంది. రణబీర్ కపూర్.. అందులో విలన్‌గా నటించనున్నట్టు సమాచారం. రణబీర్, విక్కీ బ్యాక్ టు బ్యాక్ కలిసి స్క్రీన్‌పై కనిపించడం బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు, హీరోకు అవార్డులు..

ఇక సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మామూలుగా సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. ఈ సినిమాకు ఎన్ని విమర్శలు వచ్చినా.. సందీప్‌కు మాత్రం బెస్ట్ డైరెక్టర్‌గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కింది. బెస్ట్ యాక్టర్‌గా రణబీర్ కపూర్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఇందులో లీడ్ రోల్స్ చేసిన రణబీర్ కపూర్, రష్మిక మందనా, తృప్తి దిమ్రీకి విపరీతమైన పాపులారిటీ లభించింది. రష్మిక అయితే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా రేంజ్ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. సందీప్ కూడా తన అప్‌కమింగ్ మూవీ ‘స్పిరిట్’పై ఫోకస్ పెట్టాడు. రణబీర్ కపూర్‌లాంటి చాక్లెట్ బాయ్‌ను రణవిజయ్ సింగ్‌గా వైలెంట్‌గా చూపించిన సందీప్.. ప్రభాస్‌ను ఇంకెలా చూపిస్తాడా అని ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగిపోయింది.

Also Read: నాలుగేళ్లకు ఒకసారి వచ్చేది ఏమిటో తెలుసా? - 'ఓం భీమ్ బుష్' టీమ్ అడిగిన ప్రశ్నకు జవాబు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Yadagirigutta: గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న బాలుని తల - చాకచక్యంగా బయటకు తీసిన భక్తులు, యాదాద్రి ఆలయంలో ఘటన
గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న బాలుని తల - చాకచక్యంగా బయటకు తీసిన భక్తులు, యాదాద్రి ఆలయంలో ఘటన
Embed widget