అన్వేషించండి

Ankita Lokhande: అప్పుడు నాకు 19 ఏళ్లే, ఛాన్స్ ఇస్తానంటూ కమిట్మెంట్ అడిగాడు - సౌత్ ప్రొడ్యూసర్‌పై ‘బిగ్ బాస్’ బ్యూటీ ఆరోపణలు

Ankita Lokhande: బిగ్ బాస్ 17లో కంటెస్టెంట్‌గా వచ్చిన అంకితా లోఖండే తాజాగా తన క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ గురించి బయటపెట్టింది. ఒక సౌత్ నిర్మాత తనను కమిట్‌మెంట్ అడిగాడని వ్యాఖ్యలు చేసింది.

Ankita Lokhande about Casting Couch: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ అని కొందరు హీరోయిన్లు వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే తమకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కొందరు నటీమణులు ఓపెన్‌గా స్టేట్‌మెంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ కూడా ఒక నిర్మాత తనను కమిట్‌మెంట్ అడిగారని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తనెవరో బిగ్ బాస్ 17 ఫేమ్ అంకితా లోఖండే. తన భర్త విక్కీ జైన్‌తో కలిసి తాజాగా హిందీలో పూర్తయిన బిగ్ బాస్ సీజన్ 17లో కంటెస్టెంట్‌గా వచ్చింది అంకితా. ఇక ఈ రియాలిటీ షో పూర్తయిన తర్వాత తన పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది. తాజాగా తను సినీ పరిశ్రమలో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి బయటపెట్టింది.

అంత చిన్న వయసులో..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది అంకితా లోఖండే. అందులో క్యాస్టింగ్ కౌచ్‌లాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా అని తనకు ప్రశ్న ఎదురయ్యింది. కొందరు హీరోయిన్లు.. అలాంటి విషయాలను రివీల్ చేయడం ఇష్టం లేక అలాంటి అనుభవాలు ఏమీ ఎదురవ్వలేదని సమాధానం చెప్తుంటారు. కానీ అంకితా మాత్రం వెంటనే ఆ ప్రశ్నకు ఎస్ అని సమాధానం చెప్పింది. తను 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక సౌత్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చానని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత తనకు సినిమాలో సెలక్ట్ అయ్యాయని ఫోన్ కూడా వచ్చిందట. దీంతో అంకితా చాలా సంతోషంగా ఈ విషయాన్ని తన తల్లితో షేర్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ ఒక్క రౌండ్ ఆడిషన్‌కే తనకు అవకాశం ఎలా వచ్చిందని డౌట్ పడిందట అంకితా.

టాలెంట్ అవసరం లేదు..

సినిమాలో సెలక్ట్ అయ్యిందని ఫోన్ రావడంతో మేకర్స్‌ను కలవడానికి వెళ్లిందట అంకితా లోఖండే. క్యాస్టింగ్ కో ఆర్డినటేర్‌తో పాటు వారిని కలవడానికి వెళ్లడానికి రూమ్‌లోకి తనను మాత్రమే రమ్మని నిర్మాత పిలిచాడని చెప్పుకొచ్చింది. వెళ్లిన తర్వాత మొహమాటం లేకుండా తనను కమిట్‌మెంట్ అడిగాడని గుర్తుచేసుకుంది. తనకు ఆ విషయం అర్థం కాక అసలు ఏం కావాలి అని అడగగా నేరుగా తనతో సమయాన్ని గడపమని కోరాడట ఆ నిర్మాత. ‘‘అయితే మీకు టాలెంట్ అవసరం లేదు. మీతో గడిపే అమ్మాయి మాత్రమే కావాలన్నమాట’’ అని నిర్మాతకు చెప్పి అక్కడ నుండి వచ్చేసిందట అంకితా. ప్రత్యేకంగా ఒక సౌత్ నిర్మాత తనతో అలా ప్రవర్తించాడంటూ అంకితా చెప్పిన మాటలు.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లో కూడా వైరల్ అవుతున్నాయి.

తనకే సపోర్ట్..

బిగ్ బాస్ 17లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత అంకితా లోఖండేకు పాపులారిటీ మరింతగా పెరిగిపోయింది. ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో హిట్ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది. అందులో తన భర్త విక్కీతో పాటు అంకితా పడిన గొడవలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరి గొడవల విషయంలో ఆడియన్స్ ఎక్కువగా అంకితానే సపోర్ట్ చేసేవారు. అందుకే వారి సపోర్ట్‌తో దాదాపు బిగ్ బాస్ చివరి వరకు చేరుకుంది. కానీ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 17 టైటిల్ విన్నర్‌గా స్టాండప్ కామెడియన్ మునావర్ ఫరుఖీ నిలిచాడు. 

Also Read: నిహారిక సమర్పణలో 'సాగు' - ఏకంగా 16 ఓటీటీల్లో విడుదల

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget