‘ఫ్యామిలీ స్టార్’ నుంచి క్యూట్ వీడియో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'ఊ అంటావా' పాట చేసేటప్పుడు భయంతో వణికిపోయాను - అసౌకర్యంగా అనిపించింది, మళ్లీ అలాంటి పాటలు అసలు చేయను
స్టార్ హీరోయిన్ సమంత రీఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం లాంగ్ బ్రేక్ తీసుకున్న మళ్లీ యాక్టింగ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో సమంత ఇండియా టూడే కాన్‌క్లేవ్‌కి ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలపై నోరు విప్పింది. ఈ సందర్భంగా ఆమె నటించిన తొలి ఐటెం సాంగ్ ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా పాట టైం ఆమె ఎదురైన అనుభవాలను వెల్లడించింది. ఈ పాట షూటింగ్ టైంలో తాను వణికిపోయాంటూ షాకింగ్ విషయం రివీల్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ముచ్చటగా మూడు హగ్గులు, ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి మరో క్యూట్ వీడియో - డైరెక్టర్‌తో మృణాల్, విజయ్ ఏం చేశారో చూడండి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. గతేడాది ‘ఖుషి’ లాంటి క్లీన్ హిట్‌ను అందుకున్న తర్వాత మరోసారి ఒక ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యాడు విజయ్. పరశురామ్ దర్శకత్వంలో తను నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’.. ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందనే విషయాన్ని కూడా ఒక క్యూట్ వీడియోతో బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. ఎగ్జైట్‌మెంట్‌లో తేలిపోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఓటీటీ రిలీజ్ అప్డేట్ - బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది
కొన్నిరోజుల పాటు థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాల సందడి ఎక్కువయ్యింది. ఈ నెలలో అయితే ఎక్కువగా చిన్న బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి కానీ ప్రేక్షకులు మాత్రం ఎక్కువగా ఓటీటీ కంటెంట్‌పైనే దృష్టిపెడుతున్నారు. ఇక ఈ నెల ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాల్లో మరో హారర్ మూవీ యాడ్ అయ్యింది. అదే ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. అతి తక్కువ బడ్జెట్‌తో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. పాజిటివ్ రివ్యూలను అందుకుంది. అయితే ఈ మూవీ థియేటర్లలో విడుదలయిన నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తుందని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఎన్నికల వేళ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి త్వరలో ఊహించని అప్‌డేట్..
మెగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం ఎన్నిక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఏపీలో అయితే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అక్కడ రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఎన్నికలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన సినిమాలకు షూటింగ్స్‌కి లాంగ్ బ్రేక్ పడిందని అందరికి అర్థమైపోయింది. అంటే ఇప్పట్లో పవన్ సినిమాలు అప్‌డేట్స్ ఏం లేవని అంతా డిసైడ్ అయ్యారు. ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ నిరాశలోనే ఉన్నారని చెప్పాలి. కానీ అందరి అంచనాలను తారుమారు చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
పెద్ద స్కామే.. రజనీకాంత్ పేరుతో రూ.లక్షల్లో మోసాలు - ఈ కేటుగాళ్ల వలకు చిక్కితే అంతే!
ఏ రంగంలో అయినా స్కామ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎవరినైనా స్కామ్ చేయడం చాలా సింపుల్ అని క్రిమినల్స్ భావిస్తుంటారు. అందుకే తాజాగా రజనీకాంత్ పేరు చెప్పుకొని భారీ స్కామ్‌కు పాల్పడ్డారు దుండగులు. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోహీరోయిన్లు అవ్వాలనే కోరికతోనే వస్తారు లేదా పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా చాలు అనుకుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ తాజాగా స్కామ్‌కు పాల్పడ్డారు దుండగులు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ స్కామ్ బెంగుళూరులో జరిగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)