Bhoothaddam Bhaskar Narayana OTT: ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఓటీటీ రిలీజ్ అప్డేట్ - బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది
Bhoothaddam Bhaskar Narayana OTT Release: థ్రిల్లర్‌తో పాటు కామెడీ, హారర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిపి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే టైమ్ వచ్చేసింది.
Bhoothaddam Bhaskar Narayana OTT Release Date: కొన్నిరోజుల పాటు థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాల సందడి ఎక్కువయ్యింది. ఈ నెలలో అయితే ఎక్కువగా చిన్న బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి కానీ ప్రేక్షకులు మాత్రం ఎక్కువగా ఓటీటీ కంటెంట్‌పైనే దృష్టిపెడుతున్నారు. ఇక ఈ నెల ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాల్లో మరో హారర్ మూవీ యాడ్ అయ్యింది. అదే ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. అతి తక్కువ బడ్జెట్‌తో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. పాజిటివ్ రివ్యూలను అందుకుంది. అయితే ఈ మూవీ థియేటర్లలో విడుదలయిన నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తుందని అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ప్రమోషన్స్ ఫెయిల్..
కథ, కథనం కొత్తగా ఉంటే తక్కువ బడ్జెట్ సినిమాలు అయినా.. ప్రేక్షకుల ఆదరణ లభిస్తాయి అనడానికి ఇప్పటికీ ఎన్నో చిత్రాలు ఉదాహరణగా నిలిచాయి. అలాంటి వాటిలో ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ కూడా యాడ్ అవ్వాల్సింది. కానీ సినిమాకు కావాల్సినంత ప్రమోషన్స్ చేయకపోవడంతో ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వలేకపోయింది. అందుకే చూసిన ఆడియన్స్ దగ్గర నుండి పాజిటివ్ రివ్యూ సాధించినా కూడా గుర్తింపు తెచ్చుకునేంత హిట్ మాత్రం అవ్వలేకపోయింది. ఇక మార్చి 1న థియేటర్లలో విడుదలయిన ఈ చిత్రం.. నెలరోజులలోపే.. అంటే మార్చి 22న ఓటీటీలోకి వచ్చేస్తుందని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అది కూడా చాలా క్రియేటివ్‌గా ఈ అప్డేట్‌ను ప్రకటించారు.
అన్ని ఎలిమెంట్స్‌తో..
‘బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది! అదేంటో తెలుసుకోవాలని ఉందా?’ అంటూ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఓటీటీ అప్డేట్ బయటికొచ్చింది. ఆహాలో మార్చి 22 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. కానీ ఇందులో హారర్, థ్రిల్లర్, కామెడీలాంటి ఎమిమెంట్స్ కూడా ఉండడంతో చూసిన ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివ కందుకూరి హీరోగా నటించాడు. రాశి సింగ్.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించింది. వీరితో పాటు దేవి ప్రసాద్, అరుణ్, శివ కుమార్, షఫీ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు.
View this post on Instagram
డెబ్యూతోనే సక్సెస్..
‘భూతద్దం భాస్కర్ నారాయణ’ కథ విషయానికొస్తే.. ఏపీ, కర్ణాటక సరిహద్దులోని చించోళీ ప్రాంతంలో ఓ సీరియల్ కిల్లర్ వరుసగా మహిళలను చంపుతూ ఉంటాడు. ఇక అతడు ఎవరో కనిపెట్టే డిటెక్టివ్ భూతద్దం భాస్కర్ నారాయణ పాత్రలో శివ కందుకూరి ఎంట్రీ ఇస్తాడు. ఇక ఈ కేసును ఫాలో అయ్యే జర్నలిస్ట్ లక్ష్మిగా హీరోయిన్ రాశి సింగ్ నటించింది. రాశి సింగ్‌కు ఇది మొదటి సినిమానే అయినా.. దీని ద్వారా తనకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ లభించింది. ఇక థియేటర్లలో మిస్ అయినవారు ఈ సినిమాను మార్చి 22 నుండి ఆహాలో చూసేయవచ్చు.