Family Star: ముచ్చటగా మూడు హగ్గులు, ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి మరో క్యూట్ వీడియో - డైరెక్టర్‌తో మృణాల్, విజయ్ ఏం చేశారో చూడండి
Family Star: విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతుండగా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి ఒక వీడియోను షేర్ చేశాడు విజయ్.
Vijay Devarakonda Shares a Video as Family Star Shooting Comepleted: రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. గతేడాది ‘ఖుషి’ లాంటి క్లీన్ హిట్‌ను అందుకున్న తర్వాత మరోసారి ఒక ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యాడు విజయ్. పరశురామ్ దర్శకత్వంలో తను నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’.. ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందనే విషయాన్ని కూడా ఒక క్యూట్ వీడియోతో బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. ఎగ్జైట్‌మెంట్‌లో తేలిపోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
‘దేవర’ స్థానంలోకి..
పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమే ‘ఫ్యామిలీ స్టార్’. అసలైతే ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్నట్టుగా గతేడాది మేకర్స్ ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి అవ్వకపోవడంతో ఇప్పటివరకు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. రిలీజ్ డేట్ కోసం అయోమయంలో ఉన్న సమయంలోనే ఏప్రిల్ నుండి ఎన్‌టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ తప్పుకుంది. దీంతో ఆ రిలీజ్ డేట్‌ను వదులుకోకూడదనే ఉద్దేశ్యంతో ముందుగా ‘దేవర’ రిలీజ్ అవుతుందని ప్రకటించిన ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల అవుతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. విడుదలకు ఇంకా నెలరోజులే ఉండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
థియేటర్లలో కలుద్దాం..
ఇప్పటికే ‘ఫ్యామిలీ స్టార్’ నుండి టీజర్, రెండు పాటలు విడుదల అయ్యాయి. ఇక ఇప్పుడు మూవీ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ‘ఇట్స్ ఏ రాప్’ అంటూ మృణాల్, విజయ్ కలిసి ఒక క్యూట్ వీడియోను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 5న థియేటర్లలో కలుద్దామంటూ ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. ఇక ఇప్పటివరకు మూవీ నుండి విడుదలయిన అప్డేట్ విషయానికొస్తే.. ముందుగా ‘ఫ్యామిలీ స్టార్’ నుండి ఒక గ్లింప్స్ విడుదలయ్యింది. అందులో విజయ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించాడు. దీంతో ఇదొక పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా అని ప్రేక్షకులకు అర్థమయ్యింది. ఆ తర్వాత సిడ్ శ్రీరామ్ పాడిన ‘నంద నందనా’ పాట అందరి ముందుకు వచ్చింది.
View this post on Instagram
పాటపై ట్రోల్స్..
సిడ్ శ్రీరామ్, విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని ఇప్పటికే ‘గీతా గోవిందం’ చిత్రం నిరూపించింది. ఇప్పుడు మరోసారి ‘ఫ్యామిలీ స్టార్’లో కూడా ‘నంద నందనా’ అనే పాట పాడి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాడు సిడ్ శ్రీరామ్. ఆ తర్వాత తాజాగా ‘కళ్యాణి వచ్చా వచ్చా’ అనే పెళ్లి పాట విడుదలయ్యింది. ఈ పాటను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. మహేశ్ బాబు, భూమిక కాంబినేషన్‌లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమాలో పాటకు రీమేక్‌లాగా ఉందంటూ చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మూవీ టీమ్ మాత్రం ట్రోల్స్‌ను పట్టించుకోకుండా ‘ఫ్యామిలీ స్టార్’ సక్సెస్‌పై ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read: ఒకే ఒక్క క్యారెక్టర్ నన్ను సినిమాలకు దూరం చేసింది- అసలు విషయం చెప్పిన అందాల రాశీ