అన్వేషించండి

Actress Raasi: ఒకే ఒక్క క్యారెక్టర్ నన్ను సినిమాలకు దూరం చేసింది- అసలు విషయం చెప్పిన అందాల రాశీ

హీరోయిన్ గా సత్తా చాటిన సీనియర్ నటి రాశీ.. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు పెంచింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పాత్ర ఎలాంటిదైనా చేసేందుకు రెడీ అంటున్నది.

Actress Raasi About her Movie Career: తెలుగు సినీ అభిమానులకు హీరోయిన్ రాశీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సత్తా చాటించింది. తెలుగులో అగ్ర హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆకతాయి’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రాశీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ‘అమ్మో ఒకటో తారీఖు’, ‘చెప్పాలని ఉంది’, ‘శ్రీరామచంద్రులు’, ‘దీవించండి’, ‘దేవుళ్లు’, ‘నాగ ప్రతిష్ట’, ‘పెళ్లి పందిరి’, ‘శుభాకాంక్షలు’ సహా పలు హిట్ సినిమాలు చేసింది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న క్రమంలోనే, బుల్లితెరపైనా సత్తా చాటింది. ‘గిరిజా కల్యాణం’, ‘జానకి కలగనలేదు’ సహా పలు సీరియల్స్ లో కనిపించింది.   

సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రాశీ

పెళ్లి తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యింది. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇప్పటికే ‘రాఘవరెడ్డి’ అనే సినిమాలో చేసింది. ఇందులో నందితా శ్వేతకు తల్లిగా కనిపించింది. ప్రస్తుతం వరుస సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ.. తాను సినిమాల నుంచి దూరం కావడానికి అసలు కారణం చెప్పుకొచ్చింది. సినిమాలకు తాను దూరం కావాలి అనుకున్నానే తప్ప, సినిమాలు తనని వద్దు అనుకోలేదని వెల్లడించింది. “రాశీ సినిమాలను వద్దు అనుకుంది. కానీ, సినిమాలు రాశిని వద్దు అనుకోలేదు. ఇప్పటికీ నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే, అచితూచి నిర్ణయం తీసుకుంటున్నాను. నటనా ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రను చేయడానికైనా రెడీ. తల్లిగా, అత్తగా, అక్కగా ఏ పాత్ర అయినా చేస్తాను. హీరోయిన్ గా అయితే ఇంకా మంచిది” అని చెప్పుకొచ్చింది.    

ఆ ఘటనతో సినిమాలకు దూరమయ్యా- రాశీ

సినిమా అకాశాలు వచ్చినప్పటికీ అప్పట్లో కొన్ని కారణాలతో సినిమాలు చేయకూడదని భావించినట్లు రాశీ వెల్లడించింది. ఇష్టం లేకపోయినా, కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చిందన్నారు. “కొన్నిసార్లు నచ్చకపోయినా చేసిన సినిమాలు ఉన్నాయి. మేకప్ వేసుకున్న తర్వాత సెట్ నుంచి రాశి వచ్చేసింది అనే పేరు రాకూడదనే అలా చేశాను. నేను వృత్తికి ఎంతో గౌరవం ఇస్తాను. ‘శుభాకాంక్షలు’ సినిమాలో నన్ను చూసి చాలా మంది తిట్టుకున్నారు. అంతేకాదు, నాకు పెద్ద అభిమానిగా ఉన్న ఒకావిడ సినిమాకు వెళ్లింది. ఈ సినిమా చూస్తుండగానే ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. నేను చాలా బాధపడ్డాను. నా వల్ల ఓ వ్యక్తి నవ్వాలి. అంతేతప్ప, ఇబ్బంది పడకూడదు అనుకున్నాను. అప్పుడే సినిమాల నుంచి దూరం కావాలి అనుకున్నాను” అని వివరించింది. ప్రస్తుతం మళ్లీ అవకాశాలు వస్తున్నట్లు చెప్పింది. నటిగా చక్కటి గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.  

Read Also: నా కోసం అమ్మ ఉద్యోగం మానేసింది - ప్రస్తుతం నా లక్ష్యం ఇదే: అవంతిక

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Ind vs Eng 3rd Odi Live Score: టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
Viral: తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP DesamDwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP DesamKarthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP DesamRam Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Ind vs Eng 3rd Odi Live Score: టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
Viral: తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
Rajasthan News:  ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసింది - ఆ భర్త ఉద్యోగం పోయేలా చేశాడు - టిట్ ఫర్ టాట్ !
ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసింది - ఆ భర్త ఉద్యోగం పోయేలా చేశాడు - టిట్ ఫర్ టాట్ !
Kingdom Teaser: విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే
విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే
TVK Vijay: తమిళనాట స్టాలిన్‌కు చెక్ పెడుతున్న ప్రశాంత్ కిషోర్ - విజయ్‌కు సక్సెస్ ఫార్ములా ఇచ్చేసినట్లే !
తమిళనాట స్టాలిన్‌కు చెక్ పెడుతున్న ప్రశాంత్ కిషోర్ - విజయ్‌కు సక్సెస్ ఫార్ములా ఇచ్చేసినట్లే !
Viral News: భర్త అసహజ శృంగారం - మధ్యలోనే భార్య మృతి - నిర్దోషిగా రిలీజ్ చేసిన హైకోర్టు
భర్త అసహజ శృంగారం - మధ్యలోనే భార్య మృతి - నిర్దోషిగా రిలీజ్ చేసిన హైకోర్టు
Embed widget