ప్రభాస్ మంచి మనసు, హాట్ హాట్‌గా తమన్నా, ‘సైతాన్’ ఎలా ఉంది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీకోసం
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
హాట్ సీన్లతో షాకిచ్చిన మిల్కీబ్యూటీ, గతంలో ఎప్పుడూ లేనంతగా ఆడల్ట్ సీన్స్‌తో తమన్నా రచ్చ
అరుణిమా శర్మ, హోమీ అదజనియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘జీ కర్దా‘.దినేష్ విజయన్ నిర్మించిన ఈ సిరీస్ లో తమన్నా, సుహైల్ నయ్యర్, ఆశీమ్ గులాటీ, అన్యా సింగ్, సయాన్ బెనర్జీ, సంవేదన, మల్హర్ టక్కర్, హుస్సేన్ దలాల్, అక్షయ్ బింద్రా, కిరా నారాయణన్, సిమోన్ సింగ్ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది. ఇందులో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించింది. (మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'సైతాన్' రివ్యూ : బోల్డ్ సీన్స్, బ్రూటల్ కిల్లింగ్స్ - హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
'సైతాన్' (Shaitan Web Series) ప్రచార చిత్రాలు సంచలనం సృష్టించాయి. బోల్డ్ సీన్స్ & బూతులతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' చిత్రాలు తీసిన మహి వి. రాఘవ్ (Mahi V Raghav) దీనికి దర్శకుడు కావడంతో 'ఆయన ఇలా తీశారేంటి?' అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రియేటర్ & నిర్మాతగా క్లీన్ కామెడీ హిట్ వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్' తర్వాత ఆయన నుంచి 'సైతాన్' రావడం కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ (Shaitan Web Series Review) ఎలా ఉంది? (మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'జీ కర్దా' రివ్యూ : ప్రేమకు, పెళ్లికి మధ్య డౌట్ వస్తే - తమన్నా వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
లావణ్యా సింగ్ (తమన్నా), రిషబ్ రాథోడ్ (సుహైల్ నయ్యర్) స్కూల్ నుంచి ఫ్రెండ్స్. కొన్నేళ్ళుగా లివ్-ఇన్ రిలేషన్షిప్ (సహ జీవనం)లో ఉన్నారు. ఓ పార్టీలో లావణ్యకు రిషబ్ ప్రపోజ్ చేస్తాడు... మనం పెళ్లి చేసుకుందామని! ఆమె ఓకే చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? స్కూల్ డేస్ నుంచి వీళ్ళ ఫ్రెండ్, వివాదాలతో సహజీవనం చేసే పాపులర్ పంజాబీ సింగర్ అర్జున్ గిల్ (ఆశిమ్ గులాటీ) మీద పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఒక సితార్ విద్వాంసుడు కేసు వేయడానికి కారణం ఏమిటి? (మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అన్నీ మంచి శకునములే' - ఎప్పటినుంచంటే..
నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన 'అన్నీ మంచి శకునములే' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) డేట్ ను రివీల్ చేసింది. జూన్ 17 అంటే మరో రెండు రోజుల్లో ఈ మూవీ ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ కానుంది. (మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రభాస్ మంచి మనసు - ‘సలార్‘ సిబ్బందికి అదిరిపోయే గిఫ్ట్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం 'సలార్'. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ‘కేజీఎఫ్’ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో విలన్ గా మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2023 చివరికి లేదంటే.. 2024 సంక్రాంతికి 'సలార్'ని రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. (మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)