Tamannaah: హాట్ సీన్లతో షాకిచ్చిన మిల్కీబ్యూటీ, గతంలో ఎప్పుడూ లేనంతగా ఆడల్ట్ సీన్స్‌తో తమన్నా రచ్చ
తమన్నా నటించిన తాజాగా వెబ్ సిరీస్ 'జీ కర్దా'. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది. ఈ సిరీస్ లో ఆమె బోల్డ్ అవతారం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
అరుణిమా శర్మ, హోమీ అదజనియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘జీ కర్దా‘.దినేష్ విజయన్ నిర్మించిన ఈ సిరీస్ లో తమన్నా, సుహైల్ నయ్యర్, ఆశీమ్ గులాటీ, అన్యా సింగ్, సయాన్ బెనర్జీ, సంవేదన, మల్హర్ టక్కర్, హుస్సేన్ దలాల్, అక్షయ్ బింద్రా, కిరా నారాయణన్, సిమోన్ సింగ్ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది. ఇందులో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించింది.
అందాల ఆరబోతకు హద్దులు చెరిపేసిన తమన్నా
ఇక ఈ సిరీస్ లో తమన్నా బోల్డ్ సీన్స్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా బోల్డ్ సీన్లలో రచ్చ చేసింది. ఆమె బోల్డ్ అవతార్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ‘జీ కర్దా’ వెస్ సిరీస్ లోని తమన్నా సీన్లు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. తమన్నా గ్లామర్ షోకి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వెబ్ సిరీస్ నేటి తరానికి చెందిన యువతీ యువకుల అనుభవాలకు ప్రతిబింబిస్తుందని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తమన్నా తెలిపింది. ఆమె చెప్పినట్లుగానే, తమన్నా బోల్డ్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
హాట్ సీన్లలో రెచ్చిపోయిన మిల్కీబ్యూటీ
వాస్తవానికి తమన్నా పేరు వినగానే సినీ అభిమానులకు ఆమె పాలవంటి రూపం, అందమైన నవ్వు గుర్తొస్తాయి. ఇప్పటి వరకు ఆమె చేసిన చాలా సినిమాల్లో స్కిన్ షో కూడా మరీ టూమచ్ గా ఉండదు. కనీసం, ఇప్పటి వరకు లిప్ కిస్ సీన్లు కూడా నటించలేదు. అసలు లిప్ లాక్ లాంటి సన్నివేశాలు చేయబోనని గతంలోనే తమన్నా స్పష్టత ఇచ్చింది. కానీ, పద్దతిగా ఉండే తమన్నా ఇప్పుడు, ఆ గీతను చెరిపివేసింది. ‘జీ కర్దా’ వెబ్ సిరీస్ లో హాట్ సీన్లలో రెచ్చిపోయింది. లిప్ కిస్ కాదు, ఏకంగా బోల్డ్ సీన్లలో అందాలు ఆరబోసింది. తమన్నాను ఎప్పుడూ చూడని రీతిలో చూడటంతో వీక్షకులు అవాక్కవుతున్నారు. నిజంగా ఈ సీన్లలో నటించింది తమన్నాయేనా? అని ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఓటీటీ సిరీస్ లలో బాగా బోల్డ్ సీన్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మిల్కీ బ్యూటీ కూడా ఎంటర్ అయ్యింది. తనకు ఈ కథ, ఇందులోని తన పాత్ర చాలా బాగా నచ్చిందని గతంలోనే తమన్నా చెప్పింది. ఈ కథను అర్థం చేసుకుని నటించినట్లు వెల్లడించింది. ఈ సిరీస్ లోని కీ పాయింట్ తనకు బాగా నచ్చిందని చెప్పింది. ఇంతకీ ఆమెకు నచ్చిన కీ పాయింట్ ఇదేనా అంటూ నెటిజన్లు సటైర్లు విసురుతున్నారు. హాట్ సీన్లలో రెచ్చిపోవమే అసలు పాయింట్ అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా ఈ సిరీస్ తో తమన్నా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది అని చెప్పుకోవచ్చు. ఇకపై తమన్నా నుంచి అందాల ఆరబోతకు హద్దులు ఉండవని తేల్చి చెప్పేసింది. అటు తమన్నా నటించిన మరో చిత్రం 'లస్ట్ స్టోరీస్ 2'. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో జూన్ 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Read Also: ది ఫ్లాష్ రివ్యూ: డీసీ మల్టీవర్స్ సినిమా ‘ది ఫ్లాష్’ ఎలా ఉంది?