ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అన్నీ మంచి శకునములే' - ఎప్పటినుంచంటే..
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ ప్రధాన పాత్రలు పోషించి, నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన 'అన్నీ మంచి శకునములే' ఓటీటీ(OTT)లోకి రాబోతుంది. జూన్ 17 నుంచి అమెజాన ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.
Anni Manchi Sakunamule OTT Release : నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన 'అన్నీ మంచి శకునములే' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) డేట్ ను రివీల్ చేసింది. జూన్ 17 అంటే మరో రెండు రోజుల్లో ఈ మూవీ ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ కానుంది.
'అన్నీ మంచి శకునములే' మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చూసిన ఈ సినిమా.. అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మే 18న రిలీజైన ఈ మూవీ.. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్లలోనూ విడుదలైంది. ఈ సినిమాలో హీరో సంతోష్ శోభన్ (Santosh Shibhan), మాళవికా నాయర్(Malavika Nair) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ రొమాన్స్ డ్రామాలో 'మహానటి', 'సీతారామం'లాంటి హిట్ సినిమాలను అందించిన స్వప్న సినిమా, మిత్రవింద మూవీస్ బ్యానర్ లో తెరకెక్కినా.. 'అన్నీ మంచి శకునములే' మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక మూవీ విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుండడం గమనార్హం. దానికి కారణం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకోకపోవడమేనని పలువురు ఆడియెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Mahesh Babu - Guntur Kaaram : మహేష్ బాబు ముందు బోలెడు వర్క్ - ఇంకా మినిమమ్ మూడు నెలలు!?
ఇక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకురాలు నందినిరెడ్డి.. ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పవర్ ఫుల్ ఎమోషన్స్ ను నమ్మి చేసిన ఈ సినిమా.. కంప్లీట్ ఎమోషనల్ రైడ్‌గా రూపొందింది. చిన్నతనంలోనే హీరోహీరోయిన్లు మారిపోవడం, ఒకరి ఇంట్లో మరొకరు పెరగడం అనే కాన్సెప్ట్ చుట్టూ కుటుంబ బంధాలు, వినోదాన్ని అల్లుకుంటూ ఈ కథను రాసుకున్నారు. కొన్నిసార్లు బలమే బలహీనతగా మారుతుందని అంటారు. అది ఈ సినిమా విషయంలో నిజమైంది. సెంటిమెంట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టడంతో సినిమా ఓవర్‌డోస్‌గా మారిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి సినిమాల్లో అంతర్లీనంగా కామెడీ వర్కవుట్ అయినప్పుడే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవ్వరు. కుటుంబ కథా చిత్రంగా, వినోదాత్మకంగా తీసినా ఈ సినిమాలో కామెడీ అంత పండకపోవడం సినిమాకు చాలా పెద్ద మైనస్ అయింది.
హీరో సంతోష్ శోభన్, మాళవికానాయర్ కెమిస్ట్రీ, లవ్‌స్టోరీ కూడా ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాఫీ ఎస్టేట్స్ కోర్టు డ్రామా మొత్తం సీరియల్‌గా సాగదీయడం, పిల్లలు మారిపోవడం అనే పాయింట్ బాగున్నా.. ఆ తర్వాత సన్నివేశాలను ఇంట్రెస్టింగ్‌గా చూపించలేకపోవడం కూడా పరాజయానికి ముఖ్య కారణంగా నిలిచాయి. ఆరంభంలో కాస్త పర్వాలేదనిపించినా.. చివరి ఇరవై నిమిషాల్లో వచ్చే ఫ్యామిలీ సీన్స్ మాత్రం బాగుండడంతో ప్రేక్షకులు కాస్త సంతోషించారు. ఫైనల్ గా అవే సినిమాకు బలంగా నిలిచాయి.
Read Also : 'దృశ్యం 3'పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ - మలయాళం, హిందీలో ఒకేసారి చిత్రీకరణ, మరి తెలుగులో?