అన్వేషించండి

Prabhas Gifts Salaar Crew: ప్రభాస్ మంచి మనసు - ‘సలార్‘ సిబ్బందికి అదిరిపోయే గిఫ్ట్

‘సలార్‘ హీరో ప్రభాస్ తన మంచి మనసు చాటుకున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన సిబ్బందికి చక్కటి బహుమానం అందించారు. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు ట్రాన్స్ ఫర్ చేశారు.

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం 'సలార్'.  ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ‘కేజీఎఫ్’ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో విలన్ గా మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2023 చివరికి లేదంటే.. 2024 సంక్రాంతికి 'సలార్'ని రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

‘సలార్’ చిత్రబృందానికి ప్రభాస్ మర్చిపోలేని గిఫ్ట్   

తాజాగా ‘సలార్’ చిత్ర బృందానికి ప్రభాస్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం చేశారు. లైట్ బాయ్ దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరికీ రూ. 10 వేల చొప్పున డబ్బులు అకౌంట్లోకి వేశారు.  ప్రభాస్ మంచి మనసు పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఆయన దానగుణం పట్ల ప్రశంసలు కురిపించింది. ఆయన దయకు ప్రతిరూపంగా సినిమా యూనిట్ మెంబర్స్ అభివర్ణించారు. అంతేకాదు, రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ ప్రభాస్ హీరోనే అంటూ ప్రశంసించారు.  ప్రభాస్ నిర్ణయం పట్ల సినిమా పరిశ్రమ నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

‘సలార్’ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే పలు  చాలాసార్లు వాయిదా పడిన తర్వాత, ‘సలార్’ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 28న థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అందాల తార శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ వర్ధరాజ మన్నార్ అనే నెగెటివ్ పాత్రలో కనిపించనున్నారు.. జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు కూడా ‘సలార్‌’ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

ప్రభాస్ రాబోయే ప్రాజెక్ట్స్ ఇవే!

ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సలార్’ సైతం విడుదలకు సిద్ధం అవుతోంది. అటు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న 'ప్రాజెక్ట్ K'లోనూ ప్రభాస్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో  అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

Read Also: కూతురు వయస్సుతో అమ్మాయితో లిప్ లాకా? ఆ నటుడిపై నెటిజన్ల విమర్శలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget