అన్వేషించండి

ఫుల్ యాక్షన్‌తో ‘సలార్’ టీజర్, రూ.480 కోట్లకు జవాన్, డంకీ రైట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చే యాక్షన్ - 'సలార్' టీజర్ వచ్చేసిందోచ్
సలార్... సలార్... సలార్... మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎదురు చూస్తున్నది ఈ సినిమా కోసమే! కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్... మాఫియాకు బాస్, బడా గ్యాంగ్‌స్టర్ పాత్రకు ప్రభాస్ కంటే పర్ఫెక్ట్ ఎవరు ఉంటారు? అందుకని, అభిమానులు మాత్రమే కాదు... సగటు సినీ ప్రేక్షకులలో కూడా 'సలార్' (Salaar) సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. 'కె.జి.యఫ్', 'కె.జి.యఫ్ 2' చిత్రాల తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్  (Prashanth Neel) తీస్తున్న సినిమా కూడా 'సలార్'యే కావడంతో... ప్రభాస్ ను ఆయన ఎలా చూపిస్తారో? అనే ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ విడుదలైన స్టిల్స్ అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. ఇప్పుడు టీజర్ వచ్చేసింది. ఇది రెబల్ స్టార్ అభిమానులకు కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

‘జవాన్’, ‘డంకీ’ రైట్స్‌కు అంత చెల్లించారా? మరే హీరోకు ఇంత మార్కెట్ ఉండదేమో!
ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్.. మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అవే 'జవాన్', 'డంకీ'. ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ రెండు చిత్రాల హక్కులు మొత్తం రూ.480 కోట్లకు అమ్ముడు పోయిన్నట్టు టాక్ వినిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మేమిద్దరం ప్రేమ కంటే ముందు శారీరకంగానే ఆకర్షితులయ్యాం - తమ లస్ట్ స్టోరీ చెప్పిన విద్యాబాలన్
బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ అందరికీ తెలిసే ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘ది డర్టీ పిక్చర్’తో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో విద్యా బాలన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. హానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్ అప్పటి నుంచి వరసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. విద్యా బాలన్ సినిమా కెరీర్ గురించి అందరికీ తెలిసినా ఆమె వ్యక్తిగత విషయాలు చాలా వరకూ బయటకు తెలీదు. ఆమె దాంపత్య జీవితం విషయాలు కూడా రహస్యంగానే ఉంచుతారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. విద్యా బాలన్ పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కమల్ హాసన్ టైటిల్‌తో తెలుగులోకి ఉదయనిధి స్టాలిన్ 'మామన్నన్' - రిలీజ్ ఎప్పుడంటే?
తమిళనాట రాజకీయంగానూ సంచలనమైన సినిమా 'మామన్నన్' (Maamannan Movie In Telugu). అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... ఈ చిత్ర కథాంశం, అందులో డైలాగులు. ఇది రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. రెండు... ఇందులో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కథానాయకుడు కావడం! 'మామన్నన్' మీద వచ్చిన విమర్శలు, వివాదాలు పక్కన పెడితే... విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే, తమిళ ప్రేక్షకుల నుంచి సైతం మంచి స్పందన లభించింది. దాంతో వసూళ్లు కూడా బాగా వచ్చాయి. తమిళనాట థియేటర్లలో జూన్ 29న 'మామన్నన్' విడుదల కాగా... ఇప్పటి వరకు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పుడీ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

'సలార్' టీజర్‌లో 'కెజియఫ్ 2' హింట్స్ - ఆ అంశాలు గమనించారా?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులను ఈ రోజు విడుదలైన 'సలార్' టీజర్ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. అందులో మరో సందేహం లేదు. అందుకు మెయిన్ రీజన్... ఒక్కటంటే ఒక్క షాట్‌లో కూడా ప్రభాస్ ముఖం కనిపించలేదు. ఆయన కటౌట్ చూపించి ఊరుకున్నారు. 'కె.జి.యఫ్ 2' చూసిన ప్రేక్షకులు 'సలార్' మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇంకా ఎక్కువ ఆశించారు. అందువల్ల, అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అయితే... ఒక్క విషయంలో 'సలార్' టీజర్ బాగా సక్సెస్ అయ్యింది. ఫుల్ మార్క్స్ కొట్టేసింది. థియేటర్లలో విలన్లను ప్రభాస్ ఊచకోత కోయడం గ్యారెంటీ అని బలంగా చెప్పింది. యాక్షన్ ట్రీట్ పక్కా అన్నమాట! ఆ సంగతి పక్కన పెడితే... దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' టీజర్ (Salaar Teaser)లో 'కె.జి.యఫ్ 2'తో లింక్ ఉందని హింట్స్ ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget