అన్వేషించండి

ప్రొడ్యూసర్‌గా ధోని టాలీవుడ్ ఎంట్రీ, ‘ఖుషి’ సెకండ్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ధోని నిర్మాతగా టాలీవుడ్ ఎంట్రీ - యంగ్ హీరోతో సినిమా?
టీమిండియా స్టార్ క్రికెటర్ MS ధోని ఇటీవల సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన ధోని ఇప్పుడు నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నారు. క్రికెటర్ గా ఉన్నప్పుడే పలు రంగాల్లో అడుగుపెట్టిన ధోని ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఫుల్ టైం బిజీ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్మాణంలో ఓ తమిళ సినిమాను నిర్మించారు ధోని. ఆ సినిమా ఈనెల చివరిలో ఆడియన్స్ ముందుకు రానుంది. కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా 'LGM'(Lets Get Married) అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని స్వయంగా ధోని నిర్మించారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చెన్నైలో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ధోని పాల్గొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

'మిషన్ ఇంపాజిబుల్ 7' రివ్యూ : టామ్ క్రూజ్ లేటెస్ట్ సినిమా ఎలా ఉందంటే?
హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ (Tom Cruise) అండ్ 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇండియాలోనూ 'మిషన్ ఇంపాజిబుల్'కు ఫ్యాన్స్ ఉన్నారు. అందులోనూ విడుదలకు ముందు టామ్ క్రూజ్ చేసిన స్టంట్ మేకింగ్ వీడియోలు అంచనాలు పెంచేశాయి. ప్రీమియర్ షోస్ నుంచి సూపర్బ్ రివ్యూస్ వచ్చాయి. మరి, సినిమా ఎలా ఉంది (Mission Impossible 7 Review)? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

విస్కీ పూరితో వెరైటీ మాస్ ఇంట్రో - శివన్న కూడా ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే!
కరుణాడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ 'ఘోస్ట్' (Ghost Movie). చిత్రసీమ ప్రముఖులు, కన్నడ ప్రేక్షకులు ముద్దుగా శివన్న అని పిలుచుకునే శివ రాజ్ కుమార్ పుట్టినరోజు (Shiva Rajkumar Birthday) నేడు. ఈ సందర్భంగా 'ఘోస్ట్' టీజర్ విడుదల చేశారు. 'ఘోస్ట్' టీజర్ (Ghost Teaser)లో 'They Call Me OG' (వాళ్ళు నన్ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని పిలుస్తారు) అని శివ రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సినిమాలో మాఫియాలో అందరికీ పెద్దన్నగా 'బిగ్ డాడీ' పాత్రలో ఆయన కనిపించనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరో సీక్వెల్ కి రెడీ అయిన నిఖిల్ - ఈసారి కూడా పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ!
మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. యంగ్ హీరోలతో మొదలుకొని స్టార్ హీరోలు సైతం ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఇందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరి కొంతమంది ఫెయిల్యూర్స్ ని చవిచూస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మాత్రం ఈ సీక్వెల్ ట్రెండ్ తోనే ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ ట్రెండ్ నిఖిల్ కి బాగా కలిసి వచ్చింది. ఎంతలా అంటే ఇప్పుడు మరో సినిమాకి సీక్వెల్ చేసేంతలా! ఇంతకీ అది ఏ సినిమా సీక్వెల్ అనేది ఇప్పుడు డీటెయిల్డ్ గా తెలుసుకుందాం.. నిఖిల్ కెరియర్ లో హిట్ మూవీగా నిలిచిన 'కార్తికేయ'కి గత ఏడాది సీక్వెల్ గా 'కార్తికేయ2' వచ్చి పాన్ ఇండియా వైడ్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

విజయ్ దేవరకొండ, సమంతకు పెళ్లి - అది అందమైన మెలోడీ అయితే?
రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పెళ్లి చేసుకున్నారు. నిజ జీవితంలో కాదులెండి... సినిమాలో! ఇప్పుడు వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఇందులో రెండో పాట 'ఆరాధ్య'ను నేడు విడుదల చేశారు. 'ఖుషి'లో ఆరాధ్య పాటకు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో ఈ పాటను తాను పాడినట్లు ఆమె పేర్కొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget