అన్వేషించండి

ధోని నిర్మాతగా టాలీవుడ్ ఎంట్రీ - యంగ్ హీరోతో సినిమా?

టీమిండియా క్రికెటర్ ధోని ఇటీవల నిర్మాణరంగంలో అడిగి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ తమిళ సినిమాని రూపొందించిన ధోని, ఇప్పుడు తెలుగులో ఓ సినిమాని నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

టీమిండియా స్టార్ క్రికెటర్ MS ధోని ఇటీవల సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన ధోని ఇప్పుడు నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నారు. క్రికెటర్ గా ఉన్నప్పుడే పలు రంగాల్లో అడుగుపెట్టిన ధోని ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఫుల్ టైం బిజీ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్మాణంలో ఓ తమిళ సినిమాను నిర్మించారు ధోని. ఆ సినిమా ఈనెల చివరిలో ఆడియన్స్ ముందుకు రానుంది. కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా 'LGM'(Lets Get Married) అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని స్వయంగా ధోని నిర్మించారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చెన్నైలో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ధోని పాల్గొన్నారు.

నిర్మాతగా ధోని తమిళ ఇండస్ట్రీలో సినిమా నిర్మించడానికి కారణం ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెలుగులో కూడా ఆయన ఓ సినిమాను నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ధోని నిర్మాతగా తన తదుపరిచిత్రాన్ని కూడా తమిళంలోనే చేస్తున్నారట. అయితే అదే సమయంలో ఓ తెలుగు సినిమాని కూడా నిర్మించేందుకు ధోని చర్చలు జరుపుతున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ధోని తన నిర్మాణంలో మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలతో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ధోని నిర్మాణంలో సినిమా అంటే ఏ హీరో అయినా వెంటనే డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది.

కాబట్టి త్వరలోనే టాలీవుడ్ యంగ్ హీరోతో ధోని తెలుగు సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏ సమయంలోనైనా రావచ్చని అంటున్నారు. తమిళ్ తెలుగు మాత్రమే కాకుండా హిందీలో కూడా ధోని నిర్మాణంలో సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా క్రికెటర్ గారి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని సినీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. ఈ మేరకు 'ధోని ఎంటర్టైన్మెంట్స్' అనే బ్యానర్ను స్థాపించి తన మొదటి చిత్రాన్ని తమిళంలోనే నిర్మించారు. అందుకు కారణం తమిళనాడులో ధోని కి అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. క్రికెటర్ గా ఉన్నప్పుడు ఆయన ప్రతీ ఐపీఎల్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించారు.

దాంతో తమిళనాడుతో ధోనికీ ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే తన మొదటి సినిమాని తమిళంలోనే నిర్మించారు. ఇక ధోని నిర్మించిన తమిళ మూవీ 'LGM'( Lets Get Married) జూలై 28న ముందుకు రాబోతోంది. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకి రమేష్ తమిళ్ మని దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటి నదియా, కమెడియన్ యోగి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక నిర్మాతగా ఈ చిత్రం ధోనీకి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.

Also Read : తమిళ దర్శకుడితో నాని సినిమా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaram Collections Day 10 : మా ఇంటి బంగారం సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ - అరుంధతి రికార్డును దాటేసిన సమంత
మా ఇంటి బంగారం సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ - అరుంధతి రికార్డును దాటేసిన సమంత
Idupu Kayitham: సిగ్గుతో తల దించుకోవాలి... ఇడుపు కాయితాన్ని జాతీయ సమస్యగా మారుస్తారా? టైటిల్ కాంట్రవర్సీపై నరేష్
సిగ్గుతో తల దించుకోవాలి... ఇడుపు కాయితాన్ని జాతీయ సమస్యగా మారుస్తారా? టైటిల్ కాంట్రవర్సీపై నరేష్
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
Ambati Arjun: బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Embed widget