అన్వేషించండి

Ghost Teaser : విస్కీ పూరితో వెరైటీ మాస్ ఇంట్రో - శివన్న కూడా ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే!

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ - ఇప్పుడీ పదాలు వింటే తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ గుర్తుకు వస్తారు. కన్నడ హీరో శివన్న కూడా ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటున్నారు.

They Call Him OG - తెలుగు ప్రేక్షకులకు ఈ క్యాప్షన్ చెబితే గుర్తుకు వచ్చే పేరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'ఓజీ' అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు 'ఓజీ' టైటిల్ ఖరారు చేశారు. ప్రముఖ కన్నడ కథానాయకుడు శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) సైతం ప్రేక్షకుల ముందుకు 'ఓజీ'గా రానున్నారు.

నన్ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటారు!
కరుణాడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ 'ఘోస్ట్' (Ghost Movie). చిత్రసీమ ప్రముఖులు, కన్నడ ప్రేక్షకులు ముద్దుగా శివన్న అని పిలుచుకునే శివ రాజ్ కుమార్ పుట్టినరోజు (Shiva Rajkumar Birthday) నేడు. ఈ సందర్భంగా 'ఘోస్ట్' టీజర్ విడుదల చేశారు. 

'ఘోస్ట్' టీజర్ (Ghost Teaser)లో 'They Call Me OG' (వాళ్ళు నన్ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని పిలుస్తారు) అని శివ రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సినిమాలో మాఫియాలో అందరికీ పెద్దన్నగా 'బిగ్ డాడీ' పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇక, టీజర్ ఎలా ఉందనే విషయానికి వస్తే...  

దట్టమైన చెట్ల మధ్య పాడుబడిన భవంతిలో హీరో ఒక్కడే ఉన్నాడని తెలుసుకున్న ఆఫ్రికన్ మాఫియా, అతడిని ప్రాణాలతో పట్టుకోవడానికి వస్తుంది. పది నిమిషాల్లో అతడిని పట్టుకుంటామని తమను పంపిన వ్యక్తికి ఆఫ్రికన్ ఒకరు చెబుతారు. 'మీ కంటే ముందు వెళ్లిన వాళ్ళు ఐదు నిమిషాల్లో పట్టుకుంటామని చెప్పారు. కానీ, ఇంకా తిరిగి రాలేదు' అని చెబుతారు. ఆ తర్వాత శివన్న ఎంట్రీ!

ఇప్పటి వరకు హీరో హీరోయిన్లు పానీ పూరి తినడం మీరు చూసి ఉంటారు. 'ఘోస్ట్' సినిమాలో శివ రాజ్ కుమార్ స్టైల్ సెపరేట్! విస్కీలో పూరిని ముంచుకుని తిన్నారు. దర్శకుడు శ్రీని చాలా వెరైటీగా, అదే సమయంలో హీరోయిజం ఉండేలా చూసుకుని కొత్త డిజైన్ చేశారు. ''మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో... అంత కంటే ఎక్కువ మందిని నా కళ్ళతో భయపెట్టాను. They Call Me OG. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్'' అని శివ రాజ్ కుమార్ చెప్పే డైలాగ్ టీజర్‌లో హైలైట్!  

దసరాకు శివన్న 'ఘోస్ట్' విడుదల!
కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ దసరాకు 'ఘోస్ట్' సినిమా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి కన్నడ హిట్ సినిమా 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకుడు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. నిర్మాణ సంస్థలో ఇది 31వ సినిమా. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయని చిత్ర బృందం తెలిపింది.

Also Read 'మిషన్ ఇంపాజిబుల్ 7' రివ్యూ : టామ్ క్రూజ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?


 
'ఘోస్ట్' ఆడియో హక్కులను టీ సిరీస్ కంపెనీ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి మస్తీ, ప్రసన్న విఎం మాటలు రాస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. మహేంద్ర సింహ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: సందేశ్ నాగరాజ్ (ఎమ్మెల్సీ), నిర్మాత:  సందేశ్ ఎన్, కథా, దర్శకత్వం: శ్రీని.

Also Read : రజనీకాంత్‌కు ఓ బాధ్యత తీరింది - అమ్మాయి సినిమాకు టాటా బై బై!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget