‘తండేల్’ గ్లింప్స్, ‘RC16’ మ్యూజిక్ డైరెక్టర్‌గా రెహమాన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
అదే ‘హనుమాన్’ కథ, ఆ ఒక్క షాట్ కోసం రెండేళ్లు కష్టపడ్డాం - దర్శకుడు ప్రశాంత్ వర్మ
సంక్రాంతి బరిలో దిగనున్న నాలుగు తెలుగు సినిమాల్లో ‘హనుమాన్’ కూడా ఒకటి. మిగిలిన మూడు సినిమాలు స్టార్ హీరోల సినిమాలే అయినా కూడా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఈ సంక్రాంతికే మూవీని విడుదల చేయాలని ‘హనుమాన్’ మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కుతుండడంతో ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తాజాగా ట్రైలర్ చివర్లో ఉన్న హనుమంతుడి కళ్ల షాట్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ప్రశాంత్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘తండేల్’ అంటే ఏమిటీ? దాని వెనుక అంత కథ ఉందా?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య చివరిగా కనిపించిన ‘కస్టడీ’ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైనా, ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది. ఇప్పుడు మళ్లీ ‘తండేల్’ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రెహమాన్‌కు వెల్కమ్ చెప్పిన రామ్ చరణ్ - అఫీషియల్‌గా చెప్పిన RC16 టీమ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు ఓ పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆ చిత్రానికి ఇసై పులి, ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. 'నాయకుడు' (ఉదయనిధి స్టాలిన్ తమిళ సినిమా 'మామన్నన్' తెలుగు అనువాదం) విడుదల సందర్భంగా తెలుగు మీడియాతో ముచ్చటించిన రెహమాన్ సైతం 'చర్చలు జరుగుతున్నాయి' అని చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అమెరికాలో ‘గుంటూరు కారం’ జోష్, ఫ్యాన్స్ పండగ చేసుకొనే వార్త
అమెరికాలో ‘గుంటూరు కారం’ సందడి మొదలయ్యింది. ట్రైలర్ రిలీజ్ కాకపోయినప్పటికీ మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ మూవీ గతంలో ఏ సినిమా లేనంత భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఓటీటీలోకి నితిన్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?
థియేటర్లలో ఘోరంగా డిజస్టర్ అందుకున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమయ్యింది. గతేడాది డిసెంబర్‌లో గట్టి పోటీ మధ్య ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది. ఒకవేళ టాక్ బాగుంటే యావరేజ్ హిట్‌గా అయినా నిలిచేది కానీ.. మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ అందుకుంది. దీంతో ప్రేక్షకులంతా ఈ సినిమాను స్కిప్ చేసి ఇతర సినిమాలు చూడడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 12 నుండి ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర సౌత్ భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)